Guntur Karam: ‘రమణ గాడు అండ్ రాజీ’.. సో బ్యూటిఫుల్.. ‘గుంటూరు కారం’ నుంచి మీనాక్షి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..
గుంటూరు కారం చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, మహేష్ ఖాతాల్లో వస్తోన్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఇందులో సూపర్ స్టార్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా ఇది. దీంతో గుంటూరు కారం చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా చాలా కాలం తర్వాత త్రివిక్రమ్, మహేష్ ఖాతాల్లో వస్తోన్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్. ఇందులో సూపర్ స్టార్ మాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ పై చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే కొద్ది రోజులుగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అభిమానులను థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
తాజాగా గురువారం ఈ సినిమా నుంచి హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో మీనాక్షి.. లంగావోణిలో సింపుల్ అండ్ క్యూట్ గా కనిపిస్తుంది. మహేష్ బాబు భూజంపై చేతులు వేసి క్యూట్ లుక్ లో కనిపిస్తుంది. ఈ సినిమాలో మహేష్ రమణ పాత్రలో నటిస్తుండగా.. మీనాక్షి రాజీ పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ మూవీలో పూజా హెగ్డే కథానాయికగా నటించాల్సింది. కానీ షూటింగ్ మధ్యలోనే అనుహ్యంగా మూవీ నుంచి తప్పుకుంది పూజా. దీంతో ఆమె స్థానంలో మీనాక్షిని తీసుకున్నారు.
Here’s introducing our @meenakshiioffl as ‘Raji’ from #GunturKaaram 🤩❤️🔥
𝟖 𝐃𝐀𝐘𝐒 to go… Worldwide Grand Release at theatres near you on JAN 12th! 🔥🔥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine… pic.twitter.com/WUC4rxR8W2
— Haarika & Hassine Creations (@haarikahassine) January 4, 2024
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తుండగా.. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శ్రీలీల సైతం కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తోపాటు ట్రైలర్ ఈవెంట్ సైతం గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 6న హైదారాబాద్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడకకు అతిథి ఎవరనేది తెలియాల్సి ఉంది.
Get hyped! 🔥 The much-anticipated #GunturKaaramTrailer will be revealed on JAN 6th @ MASSIVE Pre-Release event of #GunturKaaram! 🔥💥
Super🌟 @urstrulyMahesh #Trivikram @MusicThaman @sreeleela14 @meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine… pic.twitter.com/aynVm6DOFa
— Haarika & Hassine Creations (@haarikahassine) January 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.