Pushpa 2: రిలీజ్ రూమర్స్‌కు చెక్ పెట్టిన పుష్పా మేకర్స్..
తొందరపడి ఏదో ఒకటి చేయను.. ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను అంటూ ఓ సినిమాలో ఎమ్మెస్ నారాయణ డైలాగ్ చెప్తారు గుర్తుందా..? ఇప్పుడు సుకుమార్ అండ్ టీం కూడా ఇదే చేస్తున్నారు. పుష్ప 2 విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు.. కంగారు పడటం లేదు లెక్కల మాస్టారు. రిలీజ్ డేట్ విషయంలోనూ తన ప్లానింగ్స్ తనకున్నాయంటున్నారు. మరి అవేంటో చూద్దామా..? సుకుమార్ ఫోకస్ అంతా ఇప్పుడు పుష్ప 2పైనే ఉంది. ఈ చిత్రంతో తను కూడా 1000 కోట్ల లిస్టులో చేరిపోవాలని చూస్తున్నారు లెక్కల మాస్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
