Chiranjeevi: మెగాస్టార్.. పూరిజగన్నాథ్.. ఓ పాన్ వాలా.. చిరు గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన డాషింగ్ డైరెక్టర్

మెగా స్టార్ చిరు(Megastar Chiranjeevi) బర్త్‌డే.. వరల్డ్ వైడ్‌ మెగా ఫ్యాన్స్ కు పండగ డే! సోషల్ మీడియా మొత్తం ఈ స్టార్ బర్త్‌డే విషెష్ తో నిండిపోయే డే..! నెట్టింట ట్రెండింగ్‌ నేమ్‌ కాస్త మెగా నామ్‌గా మారిపోయే డే! ఇక ఇదే డే..

Chiranjeevi: మెగాస్టార్.. పూరిజగన్నాథ్.. ఓ పాన్ వాలా.. చిరు గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన డాషింగ్ డైరెక్టర్
Puri Jagannadh
Follow us

|

Updated on: Aug 22, 2022 | 4:46 PM

మెగా స్టార్ చిరు(Megastar Chiranjeevi) బర్త్‌డే.. వరల్డ్ వైడ్‌ మెగా ఫ్యాన్స్ కు పండగ డే! సోషల్ మీడియా మొత్తం ఈ స్టార్ బర్త్‌డే విషెష్ తో నిండిపోయే డే..! నెట్టింట ట్రెండింగ్‌ నేమ్‌ కాస్త మెగా నామ్‌గా మారిపోయే డే! ఇక ఇదే డే.. అన్నయ్యకు ఓ స్పెషల్ వీడియో మెసేజ్ పంపారు ఎనర్జటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌. తనకు తెలిసిన… తనే దగ్గరుండి మరీ చూసిన ఓ క్రేజీ విషయాన్ని అందరితో పంచుకున్నారు.  కామన్ ఫిల్మీ లవర్స్‌తో పాటు.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లను కూడా.. తన హార్డ్‌ కోర్ టాలెంట్‌తో తన వైపుకు తిప్పుకున్న మెగాస్టార్ చిరు.. తన బర్త్‌ డే సందర్బంగా వారందిరి విషెష్ తో తిడిచి ముద్దవుతున్నారు. బాస్‌ ఆఫ్‌ బాసెస్ అనే ట్యాగ్‌ తో నెట్టింట ట్రెండ్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ పూరీ.. చిరుకు బర్త్‌ డే విషెస్ చెబుతూ.. ఓ వీడియో రిలీజ్ చేశారు. అంతేకాదు.. చిరుతో తాను మాత్రమే గడిపిన..ఓ క్షణాన్ని అందరితో పంచుకున్నారు. తన స్టైల్లో వివరించారు. రియల్‌ ఇన్సిడెంట్‌ను కథగా చెప్పారు.

ఓ 10, 12 సంవత్సరాల క్రితం.. చిరు ఓ చిన్న కారు వేసుకుని సరదాగా.. పూరీ ఆఫీస్ కు వచ్చారట. బోరింగ్‌ గా ఉంది.. అలా బయటికి వెళ్లొద్దాం రా అని.. పూరీని కారు ఎక్కించుకుని మాధాపూర్ వైపు బయలు దేరారట. అయితే అప్పట్లో అంతగా డెవలప్‌ మెంట్ లేని మాధాపూర్ మట్టి రోడ్లతో పచ్చని చెట్లతో ఉండేదట. అలా మాట్లాడుకుంటూ వెళుతున్న క్రమంలో.. నిర్మానుష్యంగా ఉన్న ఓ ప్రదేశంతో.. రోడ్డు పక్కగా ఉన్న ఓ చిన్న పాన్ షాప్‌ను చూశారట చిరు. వెంటనే ఆ షాపు ముందు కారు ఆపి దిగారట. ఇక కష్టమర్లు లేక అప్పటికే ఖాళీగా కూర్చున్న ఆ షాప్‌ వ్యక్తి.. చిరును చూసి మెగాస్టార్ అని అరుస్తూ.. ఒక్కసారిగి పాన్ డబ్బాలోంచి బయటికి దూకేశాడట. చిరును చూసిన ఆనందంలో.. మాటలు రానంత ఉత్సాహంలో.. ఏం చేయాలో పాలుపోని కన్ఫూజన్లో చిరు ముందు నిల్చున్నారట. వెంటనే చిరు ఆ వ్యక్తిని తట్టి.. ఓ మంచి పాన్ కట్టమని కోరారట. అందుకు ఆ వ్యక్తి మళ్లీ ఒక్క ఉదుటున డబ్బాలోకి దూకి.. పాన్ కడుతూ.. మెగాస్టార్ అని అరుస్తూ చుట్టూ చూస్తున్నారట.

ఎందుకంటే.. మెగాస్టార్ చిరంజీవి తన పాన్ షాప్‌కు వచ్చారే.. ఇది ఎవరూ చూడట్లేదే.. అన్న బాధతో ఆ వ్యక్తి అటూ ఇటూ.. ఎవరైనా చూస్తే బాగుండు అన్నట్టు అనకుంటున్నారట. కాని అక్కడ ఎవరూ లేరని చెప్పిన పూరీ.. కాని నా అదృష్టం బాగుండి.. ఆ టైంలో నేను చిరు పక్కన ఉన్నా.. లేకపోతే.. నేను కూడా చిరును ఫస్ట్ టైం చూసి అలానే చేసేవాడిని అంటూ చెప్పారు. నేనే కాదు చిరు ను ఫస్ట్‌ టైం చూసిన ఎవరి రియాక్షనైనా ఇలాగే ఉంటుంది అంటూ.. అన్నారు. అన్నయ్య మీరుప్పుడు బాగుండాలి.. ఆల్‌ వేస్ లవ్‌ యూ హ్యాపీ బర్త్‌డే అంటూ.. చిరుకు విషెస్ చెప్పారు. ఈ వీడియోతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి