AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sadha: ఉదయ్ కిరణ్ మరణంపై హీరోయిన్ సదా కామెంట్స్.. ఎక్కడో తప్పు జరిగిందంటూ..

బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యహరిస్తునే మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సదా.. దివంగత హీరో ఉదయ్ కిరణ్ మృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Sadha: ఉదయ్ కిరణ్ మరణంపై హీరోయిన్ సదా కామెంట్స్.. ఎక్కడో తప్పు జరిగిందంటూ..
Sadha
Follow us
Rajitha Chanti

| Edited By: Rajeev Rayala

Updated on: Aug 22, 2022 | 2:50 PM

తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ సదా (Sadha). జయం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన సదా.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఆఫర్లు రాలేదు. దీంతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సదా.. ఇప్పుడు రీఎంట్రీ స్టార్ట్ చేసింది. బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా వ్యహరిస్తునే మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సదా.. దివంగత హీరో ఉదయ్ కిరణ్ మృతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సదా మాట్లాడుతూ.. “ఉదయ్ కిరణ్ వంటి ఓ నటుడిని కోల్పోవడం చాలా దురదృష్టం. ఆయనతో కలిసి ఔనన్నా కాదన్నా సినిమాలో నటించాను. అంతకు ముందు ఆయన వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటించారు. కానీ కెరీర్‏లో ఎక్కడ తప్పు జరిగిందనేది నాకు తెలియదు. ఆయన అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనే విషయం కూడా నాకు తెలియదు. ఒకవేళ మనం ప్లాన్ చేసుకున్నట్లు కెరీర్ లేకపోతే ఏంటీ ? జీవితం కెరీర్ కంటే గొప్పది కదా. జీవితంలో ఇంకా సాధించాల్సనవి ఉంటాయి. సినిమాలు ప్లాప్ అవుతున్నాయని నటీనటులు డిప్రెషన్‏కు వెళ్తుంటారు. అలాంటి విషయాలు చాలా విన్నాను..సినిమా ఆడడం.. ఆడకపోవడం మన చేతుల్లో ఉండవు. నటులుగా మన బెస్ట్ ఇవ్వాలి. మిగతాది ప్రేక్షకులు తీసుకుంటారు. ఔనన్నా కాదన్నా సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. అందుకు ఒత్తిడి అంతా తీసుకుని డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం సరైనది కాదు”.. అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.