Balakrishna Unstoppable: బాలయ్య షోకు గెస్ట్‌గా స్టార్ హీరో.. సీజన్ 4 గట్టిగానే ప్లాన్ చూశారుగా..
అఖండ నుంచి బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు అదే జోష్ తో సినిమాలు చేస్తున్నారు. కాగా తన నటన, తన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ, టాక్ షో హోస్ట్ గాను అదరగొట్టారు.
బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. తనదైన స్టైల్ లో యాక్షన్ సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్నారు బాలకృష్ణ. అఖండ నుంచి బాలకృష్ణ నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. వరుసగా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య. ఇప్పుడు అదే జోష్ తో సినిమాలు చేస్తున్నారు. కాగా తన నటన, తన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న బాలకృష్ణ, టాక్ షో హోస్ట్ గాను అదరగొట్టారు. అన్ స్టాపబుల్ అంటూ తనదైన మార్క్ హోస్టింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న అన్ స్టాపబుల్’ షోతో తనలోని కొత్త యాంగిల్ ను బయటకు తీసుకువచ్చారు బాలయ్య. మునుపెన్నడూ చూడని విధంగా ఆ టాక్ ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు నటసింహం.
ఇది కూడా చదవండి : Tollywood : కేంద్రమంత్రి గారి భార్య ఫేమస్ టాలీవుడ్ హీరోయిన్ .. ఆమె ఎవరో తెలుసా..?
బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ఇప్పటివరకు చాలా మంది యంగ్ హీరోలు, స్టార్ హీరోలు హాజరయ్యారు. కుర్ర హీరోలతో కలిసి బాలకృష్ణ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సరదాగా మాట్లాడుతూ.. సెలబ్రెటీల సీక్రెట్స్ బయట పెడుతూ బాలయ్య హోస్టింగ్ వారెవ్వా అనిపించింది. ఇక ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ ఇప్పుడు నాలుగో సీజన్ కు సిద్ధం అవుతోంది. త్వరలోనే అన్ స్టాపబుల్ 4ను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి :Nani’s Gang Leader: హేయ్.. గ్యాంగ్ లీడర్ పాప ఇది నువ్వేనా..! మరీ ఇంత మార్పా..!!
కాగా అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ కు స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గెస్ట్ గా హాజరు కానున్నారని తెలుస్తోంది. దుల్కర్ ఎప్పుడో తెలుగు హీరోగా మారిపోయాడు. మహానటి సినిమా నుంచి దుల్కర్ ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇక సీతారామం సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు లకీ భాస్కర్ అనే సినిమాతో రాబోతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ముగ్గురు ఇప్పుడు బాలయ్య షోకి గెస్ట్ లుగా హాజరు కానున్నారు. బాలయ్యతో దుల్కర్ ఎలాంటి ముచ్చట్లు పెట్టారు. బాలయ్య ఎలాంటి సీక్రెట్స్ రాబట్టారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
ఇది కూడా చదవండి : పవన్ కళ్యాణ్ పంజా భామ పిచ్చేక్కించిందిగా..! సినిమాలకు గుడ్ బై చెప్పి ఇప్పుడేం చేస్తుందంటే
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.