Dulquer Salmaan : బాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన దుల్కర్.. ఏమన్నారంటే
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan )ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించిన దుల్కర్.
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan )ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించిన దుల్కర్. రీసెంట్ గా సీతారామం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దుల్కర్. హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా కంటే ముందే ఓకే బంగారం సినిమాతో మనకు పరిచయం అయిన దుల్కర్ మహానటి సినిమాతో మరింత దగ్గరయ్యాడు. ఇక ఇప్పుడు సీతారామం సినిమాతో మనవాడైపోయాడు. దాంతో దుల్కర్ కు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాంతో దుల్కర్ నెక్స్ట్ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
తాజాగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ బాలీవుడ్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల బాలీవుడ్ లో ఎక్కువగా బాయ్ కాట్ అనే పదం వినిపిస్తున్న విషయం తెలిసిందే. బాయ్ కాట్ కల్చర్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉందని సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి కల్చర్ ఎక్కడా కనిపించలేదని అన్నారు దుల్కర్ సల్మాన్. బాయ్ కాట్ దెబ్బకు చాలా సినిమాల పై అక్కడ నెగిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. చిన్న సినిమా పెద్ద సినిమా అని లేకుండా బాలీవుడ్ లో విడుదలైన అన్ని సినిమాలకు బాయ్ కాట్ సెగ తగిలింది. ఇక దుల్కర్ నటించిన చుప్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..