Keerthy Suresh: రిలీజ్‌కు రెడీ అయిన కీర్తిసురేష్ ఫస్ట్ తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలుసా..
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది.
నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ కీర్తిసురేష్(Keerthy Suresh). తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహా నటి సినిమా కీర్తి సురేష్ ను తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ సినిమాతో నేషనల్ అవార్డు ను కూడా అందుకుంది కీర్తి. తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే నేను శైలజ కంటే ముందే కీర్తి సురేష్ తెలుగులో సినిమా చేసింది. కీర్తి సురేష్, నవీన్ కృష్ణ జంటగా రూపొందిన చిత్రం`జానకిరామ్`.
రాంప్రసాద్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. హ్యుమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాబ్రదర్ నాగబాబు గారు కీలకమైన పాత్రలో నటించారు. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం అని నిర్మాతలు తెలిపారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..