Seetha Ramam : హృద్యమైన ప్రేమ కథనుంచి అందమైన పాట.. ‘సీతా రామం’ ఫస్ట్ లిరికల్..
వెండితెరపై హృద్యమైన ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడిగా హను రాఘవపూడి మంచి పేరుంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాద, పడి పడి లేచే మనసు వంటి అందమైన ప్రేమకథలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హను రాఘవపూడి.
వెండితెరపై హృద్యమైన ప్రేమ కథలు తెరకెక్కించే దర్శకుడిగా హను రాఘవపూడి(Hanu Raghavapudi)మంచి పేరుంది. అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాద, పడి పడి లేచే మనసు వంటి అందమైన ప్రేమకథలను తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు హను రాఘవపూడి. తాజాగా ఆయన దర్శకత్వంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కథానాయకుడి గా యుద్ధం నేపధ్యంలో ఓ అందమైన ప్రేమకథ ‘ సీతా రామం'(Seetha Ramam) చిత్రం రూపుదిద్దుకుంటుంది. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకం పై అశ్వినీదత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఓ సీతా- హే రామా’ పాట విడుదల చేశారు. ఈ పాట సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ప్లజంట్ ట్రాక్ గా నిలిచింది.
పాటలో వినిపించిన ఈ సాహిత్యం ‘ సీతా రామం’ ప్రేమకథలో మాధుర్యాన్ని అందంగా చెప్పాయి. ఎస్పీ చరణ్, రమ్య బెహరా పాటని అద్భుతంగా ఆలపించారు. వింటేజ్ ఇళయరాజా-ఎస్పీబీ మ్యూజికల్ మోమోరీస్ ని ఈ పాట గుర్తుకు తెచ్చింది. ఆడియన్స్ లూప్ మోడ్ లో పెట్టుకొని మళ్ళీమళ్ళీ వినే చార్ట్ బస్టర్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంది. పాటలో కనిపించిన విజువల్స్ గ్రాండ్ గా వున్నాయి. దుల్కర్, మృణాల్ మధ్య కెమిస్ట్రీ బ్యుటిఫుల్ ఫీల్ ను తీసుకువచ్చిందనే చెప్పాలి. పాటలో మ్యూజిక్ మేకింగ్ కూడా చూపించారు. పెద్ద వయోలిన్ ట్రూప్ తో గ్రాండ్ సింఫనీ ఆర్గనైజ్ చేసి ఈ పాటని రికార్డ్ చేశారు. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో నిర్మాతలు ప్రత్యేక ద్రుష్టి పెట్టి అద్భుతమైన ఆల్బమ్ ని ప్రేక్షకులకు వినిపించే లక్ష్యంతో వున్నారని ఫస్ట్ సింగల్ రికార్డింగ్ చూస్తే అర్ధమౌతుంది. ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న అఫ్రీన్ అనే కీలకమైన పాత్ర పోషిస్తుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :