AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Cinema: 9వ తరగతిలోనే టాప్ హీరోయిన్.. 750 సినిమాల్లో నటించి.. ఇప్పటికీ ఒంటరిగానే..

దక్షిణాదిలో ఫేమస్ కమెడియన్. దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకుండా ఒంటరిగా గడిపేస్తుంది. తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ తన లైఫ్ త్యాగం చేసింది. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమాల్లోకి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Telugu Cinema: 9వ తరగతిలోనే టాప్ హీరోయిన్.. 750 సినిమాల్లో నటించి.. ఇప్పటికీ ఒంటరిగానే..
Kovai Sarala
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2025 | 9:49 AM

Share

దక్షిణాది సినీరంగంలో తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి భారీగా పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపిన ఆమె.. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 9వ తరగతిలోనే నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. కెరీర్ తొలి నాళ్లల్లో కథానాయికగా నటించి మెప్పించిన ఆమె.. ఆ తర్వాత సహయ నటిగా మారింది. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్ గా సత్తా చాటింది. ప్రస్తుతం ఆమె వయసు 63 సంవత్సరాలు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది. అందుకు కారణం లేకపోలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే తన కుటుంబానికి అండగా నిలబడింది. తన ఫ్యామిలీ బాధ్యతల కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే కమెడియన్ కోవై సరళ.

అన్ని భాషలలో కలిపి 750 చిత్రాలలో నటించింది. అలాగే సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిది మయ్యంలో సభ్యురాలు. హాస్యనటిగా సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఆమె.. అనేక చిత్రాల్లో సహాయ పాత్రలలో నటించారు. అప్పట్లో ఆమె కామెడీ సంచలనం. దశాబ్దాలుగా దక్షిణాదిని శాసించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది కోవై సరళ. MGR సినిమాలు చూసిన తర్వాత సినిమాల పై ఆసక్తి పెంచుకుంది. తన సోదరి, తండ్రి మద్దతుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది.

కోవై సరళ 9వ తరగతిలో ఉన్నప్పుడు తన మొదటి సినిమా ఆఫర్‌ను అందుకుంది. 1979లో విజయ్ కుమార్, కెఆర్ విజయ నటించిన వెల్లి రథం సినిమాతో వెండితెరకు పరిచయమైంది కోవై సరళ. ఆ తర్వాత పది పూర్తి చేసిన ఆమె.. థియేటర్‌లో చేరి చాలా సంవత్సరాలు స్టేజ్ షోలు చేసింది. చిన్న వయసులోనే ముడిచ్చు చిత్రంలో గర్బిణీ పాత్రను పోషించింది. ఆ తర్వాత రెండేళ్లకే 65 వృద్ధురాలి పాత్రలో కనిపించింది. కోవై సరళ .. తన నలుగురు అక్కచెల్లెళ్లకు పెళ్లిళ్లు చేసింది. తన కుటుంబం కోసం పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి
Kovai Sarala New

Kovai Sarala New

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..