AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: స్టార్ హీరోలు, విలన్స్ లేరు.. గ్లామర్ సాంగ్స్ అసలే లేవు.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..

దక్షిణాది బాక్సాఫీస్ వద్ద బడ్జెట్ కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా గురించి మీకు తెలుసా.. ? మనసులను హత్తుకునే కథ.. హృదయవిదాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. స్టార్ హీరోహీరోయిన్స్, స్పెషల్ సాంగ్స్ లేకపోయినా థియేటర్లలో సంచలనం సృష్టించింది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసా.. ?

OTT Movie: స్టార్ హీరోలు, విలన్స్ లేరు.. గ్లామర్ సాంగ్స్ అసలే లేవు.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో..
Rekhachithram
Rajitha Chanti
|

Updated on: Jun 29, 2025 | 9:26 AM

Share

సాధారణంగా సస్పెన్స్ , థ్రిల్లింగ్ ఫీల్ కలిగించే సినిమాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పటవరకు అంధాధున్, కహానీ, దృశ్యం వంటి థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కానీ ఒక్క సీన్ మిస్ కాకుండా అనుక్షణం మిమ్మల్ని కట్టిపడేసే సినిమా గురించి మీకు తెలుసా.. ? ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.6 నుంచి 9 కోట్లతో నిర్మించారు. కానీ ఆ సినిమా బడ్జెట్ కంటే 9 రెట్లు ఎక్కువ వసూళ్లు రాబట్టింది.ఈ థ్రిల్లర్ మూవీ మిమ్మల్ని చివరి వరకు జనాలను సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. ప్రతి ట్విస్టు.. ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ జనాలను కట్టిపడేస్తుంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ దూసుకుపోతుంది. సినిమా విడుదలకు ముందు చాలా తక్కువ ప్రమోషన్ జరిగినప్పటికీ ఆసక్తికరమైన కథ.. అడియన్స్ హృదయాలను గెలుచుకుంది.

వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో ఉండే ఈ సినిమా పేరు రేఖచిత్రం. ఈ సినిమాకు జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించారు. ఇది మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ చిత్రం. ఈ చిత్రంలో ఆసిఫ్ అలీ, అనశ్వర రాజన్‌తో పాటు మనోజ్ కె. జయన్, సిద్దిక్, జగదీష్, సాయికుమార్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా 40 ఏళ్ల నాటి సినీ నటి హత్య కేసును తిరిగి దర్యాప్తు చేయడానికి సస్పెండ్ అయిన పోలీసు అధికారి చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం..ఉత్కంఠభరితమైన ట్విస్టులు మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకుంటాయి. గతాన్ని, వర్తమానాన్ని కలుపుతూ ఉండే ఈ సినిమా మిమ్మల్ని కట్టిపడేస్తుంది.

కేవలం 6 కోట్లతో నిర్మించి ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.57 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా దేశంలోనే రూ.31 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..