AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మబాబోయ్..! శివ సినిమాలో ఈ చిన్నారి.. ఎంత మారిపోయింది.! ఇప్పుడు ఏం చేస్తుందంటే

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ , నాగార్జున కాంబోలో తెరకెక్కిన సినిమా శివ. ఈ మూవీ నాగార్జున కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ముఖ్యంగా నాగార్జునను ఈ మూవీ, ఓవర్ నైట్ స్టార్ హీరోగా మార్చడమే కాకుండా, మంచి క్రేజ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ రోజుల్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా 36 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ కానుంది.

అమ్మబాబోయ్..! శివ సినిమాలో ఈ చిన్నారి.. ఎంత మారిపోయింది.! ఇప్పుడు ఏం చేస్తుందంటే
Shiva
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2025 | 1:42 PM

Share

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అంటే టక్కున చెప్పే పేరు శివ. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో నాగార్జున నటన, యాక్షన్ సీన్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీలో విలన్ గా నటించిన రఘువరన్ ఆడియన్స్ ను తన నటనతో కట్టిపడేసారు. 1989లో వచ్చిన శివ సినిమా క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్ని ఇన్ని కాదు. రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాకు తనికెళ్ళ భరణి డైలాగులు రాశారు. మాస్ట్రో ఇళయ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ మూవీ పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. శివ సినిమాను 75 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించారు. శివ సినిమా 22 కేద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే 5 కేంద్రాల్లో 175 డేస్ రన్ అయ్యింది ఈ మూవీ.

ఇక శివ సినిమా ఓవర్ ఆల్ గా తెలుగు వర్షన్ 5.8 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు 36ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కు సిద్ధమైంది. నవంబర్ 14న శివ సినిమా థియటర్స్ లో మరోసారి సందడి చేయనుంది. ఇదిలా ఉంటే శివ సినిమాలో నటించిన ఓ చిన్నారి గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. శివ సినిమాలో నాగార్జున అన్న కూతురిగా నటించింది ఆ చిన్నది.

సినిమాలో ఓ సైకిల్ ఛేజ్ సీన్ లో ఆమె కూడా ఉంటుంది. కాగా ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆమె ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె పేరు సుష్మ ఆనంద్ అకోజు.  సుష్మ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. తాజాగా ఆర్జీవీ ఆమె ఫోటో షేర్ చేస్తూ.. సుష్మ ఆనంద్ అకోజు అమెరికాలో AI , కాగ్నిటివ్ సైన్స్ రంగాల్లో రీసెర్చ్ చేస్తోందని తెలిపారు. అలాగే శివ సినిమా సమయంలో నువ్వు ఎంతో రిస్కీ షాట్స్ లో నటించవు. ఆ టైం లో నువ్వు ఎంత భయపడ్డావో నాకు తెలియదు.. అందుకే ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నా అంటూ రాసుకొచ్చారు ఆర్జీవీ. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.