AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్

Abhishek Bachchan: నా హృదయం ముక్కలైంది.. అభిషేక్ బచ్చన్ ఎమోషనల్ పోస్ట్

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 1:39 PM

Share

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు అభిషేక్ బచ్చన్ తన 27 ఏళ్ల మేకప్ ఆర్టిస్ట్ అశోక్ దాదా మరణంపై భావోద్వేగానికి లోనయ్యారు. అశోక్‌ను తన కుటుంబ సభ్యుడిగా అభిషేక్ పేర్కొన్నారు, ప్రతి సినిమాకు ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు. అశోక్ మరణం తనకెంతో బాధ కలిగిస్తుందని, ఇకపై సెట్‌కు ఆయన లేకుండా వెళ్లడం కష్టమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ తనయుడు, హీరో అభిషేక్‌ బచ్చన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. తన దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్న మేకప్‌ ఆర్టిస్టు అశోక్‌ చనిపోయాడంటూ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టాడు. అతడితో కలిసి దిగిన ఫోటోను సైతం జత చేశాడు. ఇంతకీ అభిషేక్ తన పోస్టులో ఏం రాసుకొచ్చాడంటే.. “అశోక్‌ దాదా.. నా దగ్గర 27 ఏళ్లుగా పని చేస్తున్నాడు. నా ఫస్ట్‌ సినిమా నుంచి అతడే నాకు మేకప్‌ వేస్తున్నాడు. అతడు కేవలం నా టీమ్‌లో ఒక వ్యక్తి మాత్రమే కాదు, నా కుటుంబసభ్యుడు కూడా! అతడి అన్న దీపక్‌.. మా నాన్న దగ్గర దాదాపు 50 ఏళ్లుగా మేకప్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లుగా తన ఆరోగ్యం బాగుండటం లేదు. దానివల్ల కొన్నిసార్లు నాతోపాటు సెట్‌కు రావడం లేదు. కానీ నాకు మంచిగా మేకప్‌ వేయమని తన అసిస్టెంట్‌కు మరీమరీ చెప్పేవాడు. అంతకుముందు వరకు ఆయన లేకుండా నేను షూటింగ్‌కు వెళ్లిందే లేదు. చాలా మంచి వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించేవాడు. కనిపించిన వెంటనే ఆలింగనం చేసుకునేవాడు. బ్యాగ్‌లో తినడానికి ఏదో ఒకటి తెచ్చుకునేవాడు. నేను ఏదైనా సినిమా ఒప్పుకున్నప్పుడు మొదట ఈయన కాళ్లకు నమస్కరించిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్తాను. అలా ప్రతి సినిమాకు ఆయన ఆశీర్వాదం తీసుకుంటాను. ఇప్పటినుంచి తన కోసం ఆకాశంవైపు చూస్తాను.. స్వర్గంలో ఉన్న ఆయన నన్ను కచ్చితంగా దీవిస్తాడు. నీ ప్రేమాభిమానాలకు, కేరింగ్‌కు, టాలెంట్‌కు.. అన్నింటికీ థాంక్యూ దాదా. నువ్వు నాతో లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇకపై నువ్వు లేకుండానే సెట్‌కు వెళ్లాలని తల్చుకుంటేనే మనసు ముక్కలవుతోంది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా..” అంటూ అభిషేక్‌ బచ్చన్‌ భావోద్వేగానికి లోనయ్యాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉన్న వివాదం చాలదన్నట్టు 3 కోట్లు పెట్టి మరో లగ్జరీ కారు అవసరమా

తమన్నాతో మెగాస్టార్ చిందులు.. అనిల్‌ మైండ్లో ఖతర్నాక్‌ ప్లాన్‌

నీ ఇష్టమొచ్చినప్పుడు దిగనీకి బిగ్ బాస్ ఏమన్నా బస్సా..’ శివాజీ ప్రశ్నల ధాటికి బిత్తర పోయిన రాథోడ్‌

Pawan Kalyan: ఆ సమయం వచ్చింది.. పవన్‌ సంచలన ట్వీట్

ఇదీ అసలైన రణరంగమంటే బురద నీళ్లతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్