ఉన్న వివాదం చాలదన్నట్టు 3 కోట్లు పెట్టి మరో లగ్జరీ కారు అవసరమా
కేరళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల లగ్జరీ కార్ల వివాదంలో చిక్కుకున్నారు. కస్టమ్స్ దాడులు, కార్ల స్వాధీనం తర్వాత హైకోర్టు నుండి ఊరట పొందారు. ఈ ఘటన తర్వాత, ఆయన రూ.3 కోట్లకు పైబడిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ 100 ఆక్టా ఎడిషన్‌ను కొనుగోలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దుల్కర్ వద్ద ఇప్పటికే అనేక ఖరీదైన, వింటేజ్ కార్ల కలెక్షన్ ఉంది.
రీసెంట్‌గా కేరళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లగ్జీర కార్ల వివాదంలో చిక్కుకున్నాడు. అక్రమంగా విదేశాల నుంచి వాహనాలని దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలతో కస్టమ్స్ అధికారులు.. కొన్నిరోజుల క్రితం కేరళలో సోదాలు చేపట్టారు. సినిమా హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లలో రైడ్ చేసి 40కి పైగా కార్లని సీజ్ చేశారు. తన కార్లని కస్టమ్స్ స్వాధీనం చేసుకోవడంపై దుల్కర్.. కేరళ హైకోర్టుని ఆశ్రయించగా ఊరట దక్కింది. కొన్ని షరుతులు, కార్ల విలువలో 20 శాతాన్ని బ్యాంక్ గ్యారంటీగా ఇవ్వడంతో కార్లని తిరిగి దుల్కర్‌కి ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ హీరో మరో లగ్జీర కార్ కొనడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా దుల్కర్ సల్మాన్.. ల్యాండ్ రోవర్ డిఫెండర్ కంపెనీకి చెందిన 100 ఆక్టా ఎడిషన్ కారుని కొనుగోలు చేశాడు. ఈ లగ్జరీ కారు ధర రూ.3 కోట్లు పైనే ఉంటుందని సమాచారం. 4.4 లీటర్ల ట్విన్ టర్బో ఇంజిన్ కలిగిన ఈ కారు.. నాలుగు సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక దుల్కర్ గరాజ్‌లో ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్, పోర్షే, ఫెరారీ, వోల్వో లాంటి టాప్ క్లాస్ ఖరీదైన కార్లలోని మోడల్స్ అన్నీ ఉన్నాయి. 80,90లా వింటేజ్ కార్లని కూడా కొనుగోలు చేసి దుల్కర్.. తన కలెక్షన్‌లో పెట్టుకోవడంతో అంతటా హాట్ టాపిక్ అయ్యాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తమన్నాతో మెగాస్టార్ చిందులు.. అనిల్ మైండ్లో ఖతర్నాక్ ప్లాన్
నీ ఇష్టమొచ్చినప్పుడు దిగనీకి బిగ్ బాస్ ఏమన్నా బస్సా..’ శివాజీ ప్రశ్నల ధాటికి బిత్తర పోయిన రాథోడ్
Pawan Kalyan: ఆ సమయం వచ్చింది.. పవన్ సంచలన ట్వీట్
ఇదీ అసలైన రణరంగమంటే బురద నీళ్లతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్
TOP 9 ET News: సర్‌ప్రైజెస్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న జక్కన్న
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

