AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదీ అసలైన రణరంగమంటే బురద నీళ్లతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

ఇదీ అసలైన రణరంగమంటే బురద నీళ్లతో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 1:05 PM

Share

బిగ్ బాస్ తెలుగు 9 పదో వారం నామినేషన్స్ ప్రక్రియ ఉద్రిక్తంగా సాగింది. భరణి, దివ్యల మధ్య తీవ్ర వాగ్వాదం జరగగా, దివ్యను నామినేట్ చేసి భరణి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గౌరవ్‌ను ఎక్కువ మంది కంటెస్టెంట్స్ టార్గెట్ చేశారు. చివరికి ఆరుగురు - భరణి, గౌరవ్, రీతూ, నిఖిల్, సంజన, దివ్య - నామినేషన్స్ లిస్ట్‌లో చేరారు.

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారంలోకి అడుగు పెట్టింది. తొమ్మిదో వారంలో ఏకంగా ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్‌ అయ్యారు. దీంతో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ‌లో 11 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఇమ్మాన్యూయెల్‌, తనూజ, కళ్యాణ్‌, డీమాన్‌ పవన్‌, రీతూ చౌదరీ, సుమన్‌ శెట్టి, గౌరవ్‌, నిఖిల్‌, దివ్య నికితా, భరణి, సంజనా ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే పదో వారం నామినేషన్స్‌ ప్రక్రియ కూడా వాడివేడిగా జరిగింది. కంటెస్టెంట్స ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటూ నామినేట్ చేసుకున్నారు. అందులోనూ భరణి ఈ సారి దివ్యని నామినేషన్ చేయడం.. ఇప్పుడు షోలో బిగ్ ట్విస్ట్ గా మారింది. అందులోనూ దివ్య మీద అరుస్తూ.. భరణి చెలరేగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. నామినేషన్స్ ప్రక్రియను షురూ చేసిన ఇమ్మాన్యుయేల్.. మొదట భరణిని నామినేట్‌ చేశాడు. భరణిలో మునుపు ఉన్నంత కాన్ఫిడెంట్ కనిపించడం లేదంటూ.. భరణి బౌన్స్ బ్యాక్ కావాల్సిన అవసరం ఉందంటూ చెప్పాడు. ఇక రీతూ చౌదరి దివ్యను నామినేట్ చేసింది. దివ్య గ్యాగ్‌ లీడర్‌గా బిహేవ్ చేస్తుందని.. తన చుట్టూ ఓ ఇద్దరు ముగ్గురిని తిప్పుకుంటూ.. వాళ్లను ఇన్‌ఫ్లూయెన్స్‌ చేస్తుందంటూ ఆరోపించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్న యుద్దమే జరిగింది. ఇక ఆ తర్వాత నువ్వొక సెల్ఫిష్‌ ప్లేయర్‌ వి అంటూ.. సంజనాని నామినేట్‌ చేశాడు గౌరవ్‌. ఇక మరోవైపు కళ్యాణ్‌ నిఖిల్‌ని నామినేట్‌ చేశాడు. ఆట బాగా లేదని, ఇంకా ఆడాలని నిఖిల్ కు సూచించాడు కల్యాణ్. ఇక అందరికీ దిమ్మతిరిగే చేస్తూ.. ఇన్నోసెంట్‌ ఫేస్‌తో నామినేట్ చేయడానికి వచ్చిన భరణి.. తాను దివ్యని నామినేట్ చేస్తున్నట్టు చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. భరణి తన పేరు తీయడంతో.. దివ్య కూడా మొదట షాకైంది. ఆ తర్వాత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె ఫేస్‌లో బాధ క్లియర్‌గా కనిపించింది. దాంతో పాటే బీబీ ఆడియన్స్‌ను కూడా షాక్ అయ్యేలా చేసింది. రిమైనింగ్ నామినేషన్స్‌ విషయానికి వస్తే… సుమన్‌ నిఖిల్‌ని నామినేట్ చేయగా.. నిఖిల్ రీతూని నామినేట్ చేశాడు. ఇక తనూజ,డీమాన్ గౌరవ్‌ని నామినేట్ చేయగా.. సంజనని గౌరవ్‌ నామినేట్ చేశాడు. గౌరవ్‌ని, తనూజ, సంజనా, పవన్‌లు, సంజనాని గౌరవ్‌.. నామినేషన్‌ చేశారు. ఇలా మొత్తానికి ఈ వారం కంటెస్టెంట్స్ అందరూ గౌరవ్ నే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఓవర్‌ ఆల్‌గా నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యేసరికి మొత్తం ఆరుగురు సభ్యులు భరణి,గౌరవ్,రీతూ,నిఖిల్,సంజన, దివ్య లిస్ట్‌లో చేరారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: సర్‌ప్రైజెస్‌తో దిమ్మతిరిగేలా చేస్తున్న జక్కన్న

థాంక్యూ ప్రభాస్‌! భోజనంతో కడుపు మాత్రమే కాదు.. నా హృదయం కూడా నింపేసావు’

‘మా నాన్న చనిపోలేదు..’ తప్పుడు వార్తలపై ధర్మేంద్ర కూతురు సీరియస్

‘మెడలో నక్లెస్‌ కాదు.. పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటా’ ట్రోలర్స్‌కు శిరీష్‌ దిమ్మతిరిగే పంచ్‌

తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో

Published on: Nov 12, 2025 01:05 PM