AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో

తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో

Phani CH
|

Updated on: Nov 12, 2025 | 12:37 PM

Share

కోలీవుడ్ నటుడు అభినయ్ 44 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు. తన ఆయుష్షు ఏడాది మాత్రమేనని ఇటీవల ఓ వీడియోలో వెల్లడించిన మూడు నెలలకే ఆయన మరణించడం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు, చివరి కోరికపై కోలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కోలీవుడ్ సినిమా ప్రపంచంలో హీరోగా ఓ వెలుగు వెలిగిన అభినయ్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 10న మృతి చెందారు. ఆయన మరణంపై సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చాలా కాలంగా అభినయ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇటీవలే మీడియా ముందుకు వచ్చారు. కేవలం తాను ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే వీడియో రిలీజ్ చేసిన మూడు నెలలకే ఈ హీరో మరణించడం ఇప్పుడు అందర్నీ భావోద్వేగానికి గురిచేస్తోంది. కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. మలయాళంలో నటి టి.పి రాధమణి కుమారుడు అభినయ్ కింగర్. 2002లో విడుదలైన ‘తుళ్లువతో ఇలామై’ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ హీరోగా తెరంగేట్రం చేయగా.. ఆయన స్నేహితుడిగా అభినయ్ నటించారు. ఆ తర్వాత ‘కైయెత్తుం దూరతు’ అనే చిత్రం తో మలయాళ సినిమాలో నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో అభినయ్‌ హీరోగా మెప్పించారు. 2014 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నాడు అభినయ్. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 10 సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్న క్రమంలోనే.. ఇటీవలే కొన్ని నెలల క్రితం అభినయ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అందులో అతడు పూర్తిగా బక్కిచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు. తన వైద్య ఖర్చులు భరించడానికి తాను ఇబ్బంది పడుతున్నానని.. సాయం చేయాలంటూ ఆ వీడియోలో అందర్నీ వేడుకున్నాడు. అదే వీడియోలో తాను ఏడాది కంటే బతకలేనంటూ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే చికిత్స తీసుకుంటూ అభినయ్‌ కన్నుమూశారు. ప్రస్తుతం అభినయ్ వయసు 44 సంవత్సరాలు మాత్రమే.. దీంతో కోలీవుడ్ ఒక్క సారిగా షాకైంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇప్పుడు కోరకుంటోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మరో వారంలో డార్లింగ్ సినిమా పాట విడుదల

మహిళల ఆరోగ్యం.. క్యాన్సర్ నివారణ ఆధునిక చికిత్స

Brahmos missiles: మన బ్రహ్మోస్‌కు మస్తు గిరాకీ.. కొనేందుకు క్యూ కడుతున్న దేశాలు

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా