AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

H-1B Visa: అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌

Phani CH
|

Updated on: Nov 11, 2025 | 4:47 PM

Share

అమెరికా వీసా నిబంధనలు కఠినతరం అయ్యాయి. ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన 'పబ్లిక్ ఛార్జ్' రూల్ ప్రకారం, ఆరోగ్య సమస్యలున్నవారు, వైద్య ఖర్చులు భరించే స్థోమత లేనివారికి వీసాలు దక్కవు. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు, దరఖాస్తుదారుడి వయస్సు, ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ప్రభుత్వ సహాయంపై ఆధారపడతారా లేదా అనేదాని బట్టే వీసా మంజూరుపై నిర్ణయం ఉంటుంది.

అమెరికాలోకి ఎంట్రీ ఇకపై అంత ఈజీ కాదు. ఇప్పటికే ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ పేరుతో దేశంలో ఉన్నవాళ్లను తరిమేస్తున్నారు. ఇక H1-B వీసా ఫీజు లక్ష డాలర్లు అంటూ బాదేశారు. ఈసారి మరో కొత్త రూల్ తో వలసదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. అమెరికా వీసాల మంజూరుపై ట్రంప్‌ సర్కార్‌ మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా పబ్లిక్ ఛార్జ్ పేరుతో కొత్త రూల్స్‌ తెచ్చారు. వీసా మంజూరీ విషయంలో ఇకపై ఆరోగ్యానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. పబ్లిక్‌ ఛార్జ్‌ రూల్స్‌లో భాగంగా అమెరికాలో వైద్య ఖర్చులు భరించే స్థోమత ఉన్నవాళ్లకు మాత్రమే వీసాలు ఇస్తారు. అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు వీసాల మంజూరు విషయంలో, సమగ్రంగా వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. డయాబెటిస్‌, ఒబెసిటీ ఉన్నవారికి, హృద్రోగులకు వీసా మంజూరు చేయరాదంటూ బ్యాన్‌ విధించారు. అంతేకాకుండా ఇకపై వీసా దరఖాస్తుదారుడి వయస్సు కూడా కీలకం కానుంది. శరణార్ధుల విషయంలో చాలా కఠినంగా ఉండాలని సూచించారు. ఊబకాయంతో ఆస్తమా, స్లీప్ అప్నియా, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, ఆ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగా, వీసా దరఖాస్తుదారుడి వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు పబ్లిక్ ఛార్జ్ అయ్యే ప్రమాదం ఉందో లేదో అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలు వెంటనే అమలు చేయాలని ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలకు ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో అమెరికా వీసా కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారుల ఆరోగ్య పరిస్థితిని.. ఇమ్మిగ్రేషన్ అధికారులు పరిశీలించేవారు. స్క్రీనింగ్ టెస్టుల ద్వారా టీబీ వంటి అంటువ్యాధులు ఉన్నాయా? లేదా? అనే చెక్ చేసేవారు. ఇప్పుడేమో.. డయాబెటిస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులుంటే.. అలాంటి వారికి కూడా వీసా ఇచ్చే అవకాశం లేదు. డయాబెటిస్‌, ఒబెసిటీ ఉన్న ప్రతి ఒక్కరికీ వీసా రాదని దీని అర్ధం కాదు. అలాగే వీసా.. ఆటోమేటిక్‌గా తిరస్కరణ కూడా గురికాదు. ఇవి వీసా అధికారికి ఇచ్చిన గైడ్ లైన్స్ మాత్రమే. దరఖాస్తుదారుడి మొత్తం ప్రొఫైల్‌ను అంటే ఆర్థిక స్తోమత, వయస్సు, ఆరోగ్య బీమా, విద్య, నైపుణ్యాలను పరిశీలించి, కేవలం వారి ఆరోగ్య పరిస్థితి కారణంగానే వారు భవిష్యత్తులో ప్రభుత్వ సహాయంపై ఆధారపడతారా లేదా అనేదానిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. వీసా ఇంటర్వ్యూకు ముందే అలాంటి సమస్యలుంటే దరఖాస్తులో పేర్కొనాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని అమెరికాలోకి ఆహ్వానిస్తే.. భవిష్యత్తులో కొన్ని సమస్యలు తలెత్తుతాయని, ఆ సమస్యలు ప్రభుత్వ ఖజానాపై ప్రభావం చూపిస్తాయని భావిస్తున్నారు. కాబట్టి కొన్ని వ్యాధులున్న దరఖాస్తుదారులను అమెరికాలోకి రానివ్వకపోతే సమస్యలకు చెక్ పెట్టినట్లే అవుతుంది. ఇదంతా చూస్తుంటే.. వీసాలను మరింత పరిమితం చేయడానికి ట్రంప్ కంకణం కట్టుకున్నట్లు అర్థమవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీరు కొన్న బంగారం ఒరిజనలేనా ?? గుంటూరులో నకిలీ హాల్ మార్క్ దందా

పేకాట రాయుళ్లకు కోర్టు.. శ్రీకాకుళం కోర్ట్ వినూత్న శిక్ష

ప్రేమించలేదని పగబట్టి.. జైలు పాలైన లేడీ కిలాడీ

Elon Musk: చరిత్ర సృష్టించబోతున్న ఎలన్‌ మస్క్‌

Vizag: వెబ్‌సైట్లు,యూట్యూబ్‌లో సెర్చ్ చేసి అత్తను హత్య చేసిన కోడలు