AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్లమ్మకు ఇంతమంది హీరోలు ఎందుకు మారారు.. అసలు విషయం చెప్పిన దర్శకుడు వేణు

బలగం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నాడు దర్శకుడు, నటుడు వేణు. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు.. ఆతర్వాత పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి నవ్వులు పూయించారు. ఆతర్వాత దర్శకుడిగా మారి బలగం అనే సినిమా చేశారు.

ఎల్లమ్మకు ఇంతమంది హీరోలు ఎందుకు మారారు.. అసలు విషయం చెప్పిన దర్శకుడు వేణు
Yellamma Movie
Rajeev Rayala
|

Updated on: Apr 01, 2026 | 11:54 AM

Share

కామెడియన్ నుంచి దర్శకుడిగా మారారు వేణు ఎల్దండి. సినిమాలో కమెడియన్ గా నటించి మెప్పించిన వేణు.. ఆతర్వాత జబర్దస్త్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా మారిన తర్వాత వేణు తెరకెక్కించిన బలగం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బలగం సినిమాకు అవార్డులు కూడా క్యూ కట్టాయి. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కూడా తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో దేవీ శ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు.

ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి

కాగా ఈ సినిమాకు ముందుగా హీరోగా నానిని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నాని ప్లేస్ లోకి నితిన్ పేరు వచ్చింది. కానీ నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. కానీ ఎక్కడా అనౌన్స్ చేయలేదు. ఆ తర్వాత నితిన్ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని వార్తలొచ్చాయి. నితిన్ కూడా ఈ సినిమా నుంచి పక్కకు వచ్చేయడంతో ఆతర్వాత సినిమాలో హీరోగా ఎవరు చేస్తారు అని అందరూ అనుకున్నారు. మధ్యలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఫైనల్ గా దేవీ శ్రీ ప్రసాద్ తో ఎల్లమ్మ సినిమాను అనౌన్స్ చేశాడు వేణు.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

ఇక ఇంతమంది హీరోలు మారడానికి కారణం బయట పెట్టాడుదర్శకుడు వేణు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా కథను సిద్ధం చేసినప్పుడు.. బాడీ లాంగ్వేజ్ ఎమోషన్స్ పండించగల నటుడిని ఊహించుకున్నా కానీ ఆతర్వాత పాత్రలో మరిన్ని లోతైన మార్పులు చోటుచేసుకున్నాయి. కథను అనుకున్నప్పుడు మనం ఓ హీరోని ఊహించుకొని రాసుకుంటాం.. కానీ కథను రాసే కొద్దీ ఆ పాత్ర స్వభావం మారుతుంది దాంతో హీరోలను కూడా మార్చాల్సి ఉంటుంది. హీరోలను మార్చటానికి కొన్నిసార్లు కాల్ షీట్స్ సమస్య కూడా ఒక కారణం అవుతుంది. ఏదేమైనా, సినిమా అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వేణు చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. ఒక్కసారిగా చుట్టుముట్టారు.. ఆ తర్వత
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
ముంబైలో లగ్జరీ అపార్ట్‌మెంట్ అద్దెకి తీసుకున్న టీ20 కెప్టెన్
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
భార్యతో సన్నిహితంగా కనిపించిన డ్రైవర్.. ఆ తర్వాత ఏంజరిగిందంటే
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
వార్నీ.. మరీ అంత తక్కువా.. 1960లో బంగార ధర తెలిస్తే..
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
మస్క్‌ మామా మజాకా..? ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌..!
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ