AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaaram: ఇంత మంచి సీన్స్ ఎందుకు లేపేశారు? సమంత ‘మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్ ఇదిగో.. వీడియో

దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నటించిన చిత్రం మా ఇంటి బంగారం. జూన్ 19న రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటికే రూ. 80 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి డిలీట్ చేసిన కొన్ని సన్నివేశాలను రిలీజ్ చేశారు మేకర్స్.

Maa Inti Bangaaram: ఇంత మంచి సీన్స్ ఎందుకు లేపేశారు? సమంత 'మా ఇంటి బంగారం' డిలీటెడ్ సీన్స్ ఇదిగో.. వీడియో
Maa Inti Bangaaram Movie
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 6:13 PM

Share

టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ సినిమా ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్, మహిళలు ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సమంత సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ఏకంగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ లోనూ మా ఇంటి బంగారం సినిమాకు రికార్డు కలెక్షన్లు వస్తున్నాయి. అక్కడ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్లు 2 మిలియన్ డాలర్లను క్రాస్ చేసిందని చిత్ర బృందం పేర్కొంది . ప్రస్తుతం ఈ సినిమా జోరు చూస్తుంటే త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తాజాగా మా ఇంటి బంగారం సినిమాలోని డీలీటెడ్ సీన్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించింది సామ్. అలా తాజాగా రిలీజ్ చేసిన డిలీటేడ్ సీన్స్ తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి.

ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మించారు. సమంతతో పాటు శ్రీనివాస గవిరెడ్డి, మంజూష, దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమీ, ఆనంద్, లక్ష్మీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

సమంత ‘మా ఇంటి బంగారం’ డిలీటెడ్ సీన్స్ చూశారా? వీడియో ఇదిగో

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా