AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై అతివేగంగా విన్యాసాలు చేస్తూ, వెనుక కూర్చున్న మహిళ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన ఓ వ్యక్తి వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్!
Young Couple Bike Stunt
Balaraju Goud
|

Updated on: Jul 26, 2026 | 1:57 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై అతివేగంగా విన్యాసాలు చేస్తూ, వెనుక కూర్చున్న మహిళ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన ఓ వ్యక్తి వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

@Vibhasumahi అనే ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌ను అత్యంత వేగంగా జిగ్‌జాగ్ పద్ధతిలో నడుపుతూ కనిపిస్తున్నాడు. అతడి వెనుక కూర్చున్న మహిళ పదేపదే బ్యాలెన్స్ కోల్పోతూ బైక్‌పై నుంచి పడిపోవడానికి దగ్గరగా వెళ్లడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బైక్ ఒక్కసారిగా ఎడమ, కుడి వైపులకు మలుపులు తిరుగుతుండటంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురైనట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ బైక్ నడుపుతున్న వ్యక్తి మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్టంట్ కొనసాగించడం వీడియోలో కనిపిస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొద్ది గంటల్లోనే వేలాది మంది వీడియోను వీక్షించగా, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. “ఆత్మవిశ్వాసం బాగుంది… కానీ బాధ్యత ఎక్కడ?”, “ఒక్క క్షణం అదుపు తప్పినా ఇద్దరి ప్రాణాలు పోయేవి”, “వైరల్ కోసం ప్రాణాలతో చెలగాటమా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి ప్రమాదకర స్టంట్లు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడిపేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వినోదం పేరుతో ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇటువంటి వీడియోలు యువతకు తప్పుదారి పట్టించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో ఏ ప్రాంతంలో చిత్రీకరించారన్న విషయం స్పష్టంగా తెలియరాలేదు. అయితే ఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. దీంతో రోడ్డు భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. నిపుణులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, స్టంట్లకు బదులుగా బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి..

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!