AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

విమానంలో సీటు బెల్టు పెట్టుకోవడం ఎంత ముఖ్యమో.. ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌‌లో పెట్టడం కూడా అంతే ముఖ్యమని సిబ్బంది పదే పదే చెప్తుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ పొరపాటున ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టడం మర్చిపోతే అసలేం జరుగుతుంది? నిజంగానే విమానం కంట్రోల్ తప్పుతుందా? లేక నార్మల్ కంట్రోల్ రూల్ మాత్రమేనా? అనేది తెలుసుకుందాం..

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..
Why Airplane Mode On Flight
Krishna S
|

Updated on: Jul 26, 2026 | 1:22 PM

Share

విమానంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందే క్యాబిన్ సిబ్బంది మైకులో “దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి” అని పదే పదే అనౌన్స్ చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది.. అసలు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? విమానం ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? లేదా ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తుతుందా? అని.. దీనికి నిపుణుల సమాధానం ఏంటంటే.. ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే విమానం వెంటనే కూలిపోవడం లేదా పెద్ద ప్రమాదాలు జరగడం వంటివి సంభవించవు. కానీ ప్రయాణ భద్రత, విమాన వ్యవస్థల పనితీరు దృష్ట్యా ఈ చిన్న నియమాన్ని పాటించడం చాలా అవసరమని చెబుతున్నారు.

ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయకపోతే ఏం జరుగుతుంది?

మొబైల్ ఫోన్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు, అది నిరంతరం సమీపంలోని మొబైల్ టవర్‌తో కనెక్ట్ అవ్వడానికి సిగ్నల్స్ వెతుకుతూనే ఉంటుంది. విమానం చాలా ఎత్తైన ప్రదేశంలో, అత్యంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ పదేపదే వేర్వేరు నెట్‌వర్క్ టవర్లకు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఫోన్ నిరంతరం బలమైన రేడియో సిగ్నల్స్‌ను విడుదల చేస్తుంది.

పైలట్లకు ఇబ్బంది కలిగించే ఎలక్ట్రానిక్ శబ్దం

ప్రస్తుత కాలంలో తయారవుతున్న ఆధునిక విమానాలను ఎలక్ట్రానిక్ పరికరాల సిగ్నల్స్ వల్ల పెద్దగా ప్రభావం పడకుండా సరికొత్త సాంకేతికతతో రూపొందిస్తున్నారు. అయినప్పటికీ, విమానంలో ఉన్న పదుల సంఖ్యలోని ప్రయాణికుల ఫోన్‌లు ఒకే సమయంలో నెట్‌వర్క్ కోసం ప్రసారం చేసే సిగ్నల్స్ వల్ల కాక్‌పిట్‌లోని పైలట్లకు, గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి మధ్య జరిగే రేడియో కమ్యూనికేషన్‌లో అదనపు ఎలక్ట్రానిక్ నాయిస్ ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా విమానం టేకాఫ్, ల్యాండింగ్ అయ్యే క్లిష్ట సమయాల్లో ఈ శబ్దం పైలట్లను ఇబ్బందికి గురిచేస్తుంది. అందుకే ఈ సమయంలో ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టడం తప్పనిసరి.

ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్ అవుతుంది

ఎయిర్‌ప్లేన్ మోడ్ పెట్టకపోవడం వల్ల విమానానికి మాత్రమే కాదు, మీ ఫోన్‌కు కూడా నష్టమే. వేల అడుగుల ఎత్తులో మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్ సరిగ్గా అందవు. సిగ్నల్ అందుకోవడానికి మీ ఫోన్ తీవ్రంగా శ్రమిస్తూ ఎక్కువ శక్తిని ఉపయోగిస్తుంది. దీనివల్ల ఫోన్ వేడెక్కడమే కాకుండా బ్యాటరీ చాలా వేగంగా అయిపోతుంది. పైగా ఎలాగూ నెట్‌వర్క్ ఉండదు కాబట్టి నార్మల్ కాల్స్ మాట్లాడటం లేదా ఇంటర్నెట్ వాడటం సాధ్యపడదు.

ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో కూడా ఈ పనులు చేయవచ్చు

చాలామంది ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెడితే స్విచ్ ఆఫ్ అయినట్లే అనుకుంటారు. కానీ అది నిజం కాదు.. ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేసిన తర్వాత కూడా మీరు ఫోన్‌లో ఇష్టమైన పనులు చేసుకోవచ్చు.. ఫ్లైట్ సెలైంట్ అయ్యాక వై-ఫై, బ్లూటూత్ ఆన్ చేసుకోవడానికి చాలా విమానయాన సంస్థలు అనుమతిస్తాయి. విమానంలో ఇన్ ఫ్లైట్ వైఫై సదుపాయం ఉంటే ఇంటర్నెట్ వాడవచ్చు, మెసేజ్‌లు పంపవచ్చు. ముందే డౌన్‌లోడ్ చేసుకున్న సినిమాలు, పాటలు వినవచ్చు, గేమ్‌లు ఆడుకోవచ్చు. బ్లూటూత్ ద్వారా వైర్‌లెస్ హెడ్‌ఫోన్లు కనెక్ట్ చేసుకుని మ్యూజిక్ వినొచ్చు.

Follow Us
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?
2027 వన్డే వరల్డ్ కప్‌నకు మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి..?
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ప్రత్యక్ష ప్రసారం
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
కరీంనగర్ యువతి సత్తా.. ఏకంగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కొలువు!
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం సూపర్ స్కీమ్
దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
దైవ దర్శనానికి వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లో 9 మంది భక్తులు మృతి
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
6 తరాలు.. 83 మంది కుటుంబ సభ్యులతో అందరికీ ఒకే ఇల్లు.. ఒకే వంట
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
శ్రావణ మాసంలో అష్ట లక్ష్మి యోగం.. వీరికి పట్టింది బంగారమే!
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
చెల్లికి చివరి మెసేజ్ పంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్వ్‌వేర్ ఉద్యోగి
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో
కిచెన్‌లో పడగవిప్పి నాగుపాము ఏం చేసిందంటే.. ఇదిగో వీడియో