ఇన్నాళ్లు ఏమైపోయారు మేడమ్.. కిర్రాక్ చూపులతో హీరోయిన్ అరాచకం..

Rajitha Chanti

Pic credit - Instagram

02  July 2026

'ఓరి దేవుడా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ముంబై ముద్దుగుమ్మ మిథిలా పాల్కర్ తన క్యూట్ లుక్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

వెబ్ సిరీస్‌లు, సినిమాలతో బిజీగా ఉండే ఈ భామ.. తాజాగా 'సూపర్ సుబ్బు' అనే సరికొత్త సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

ఇందులో భాగంగా మిథిలా పాల్కర్ సాంప్రదాయమైన చీరకట్టులో మెరిసిపోయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రమోషన్స్‌లో పక్కా ట్రెడిషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది.

అందమైన చీర, దానికి తగ్గట్టుగా డిజైన్ చేసిన బ్లౌజ్ ధరించి దేవకన్యలా మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన అందమైన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

తన సిగ్నేచర్ కర్లీ హెయిర్ (ఉంగరాల జుట్టు)తో పాటు సింపుల్ మేకప్, సరిపోయే ఆభరణాలు ధరించడంతో ఆమె లుక్ మరింత అందంగా తయారైంది. ఆ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

 సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్‌గా మారడంతో, అభిమానులు "చీరకట్టులో మిథిలా ఏమన్నా మెరిపిస్తుందా!", "ట్రెడిషనల్ లుక్‌లో అద్భుతంగా ఉంది" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న మిథిలా పాల్కర్, విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె నటించిన 'సూపర్ సుబ్బు' సిరీస్ పై అంచనాలు ఉన్నాయి.

ప్రమోషన్స్ కోసం ఆమె ఎంచుకున్న ఈ ట్రెడిషనల్ స్టైల్ స్టేట్‌మెంట్ సిరీస్‌కు మరింత మైలేజ్ తెచ్చిపెడుతోంది. గ్లామర్ పరంగానే కాకుండా నటనలోనూ తనదైన ముద్ర వేసింది.