AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Emmanuel: నేను అలా చేసే సరికి సొంత అన్నే శత్రువులా చూశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మాన్యుయేల్

జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కు సొంత అన్న అయిన వంశీ నండూరి ఇటీవల సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమాలో ఓ కీలక పాత్ర పోషించాడు. విలన్ గా నెగెటివ్ ఛాయలున్న రోల్ లో అదరగొట్టాడు. అయితే తాజాగా ఓ టీవీ షోకు హాజరైన ఇమ్మాన్యుయేల్ తన సొంత అన్న గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

Jabardasth Emmanuel: నేను అలా చేసే సరికి సొంత అన్నే శత్రువులా చూశాడు.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మాన్యుయేల్
Jabardasth Emmanuel
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 6:52 PM

Share

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇమ్మాన్యుయేల్ ఒకడు. ఇతని కామెడీ టైమింగ్ కు, పంచులు, ప్రాసలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు టీవీ షోల్లో సందడి చేస్తున్నాడు ఇమ్మూ. ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు. తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ అభిమానుల మనసులు గెల్చుకున్నాడు. త్రుటిలో బిగ్‌బాస్ టైటిల్ కోల్పోయినప్పటికీ.. ఆ సీజన్‌లో స్టార్ ఎంటర్‌టైనర్‌గా కింగ్ అక్కినేని నాగార్జున ప్రశంసలు అందుకున్నాడు ఇమ్మాన్యుయేల్. ప్రస్తుతం టీవీ షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు ఇమ్మాన్యుయేల్. అయితే తాజాగా ఒక టీవీ షోకు హాజరైన ఈ జబర్దస్త్ కమెడియన్ తన సొంత అన్నయ్య, నటుడు వంశీ నండూరి గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డీ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఇమ్మాన్యుయేల్ సోదరుడు వంశీ నండూరి కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. సినిమాలో సమంత వెనకే ఫాలో అవుతూ తరచూ ఆమెతో తిట్టించుకోడం, పెద్ద గరిటెతో సామ్ తో కొట్టించుకోవడం, ఫైట్ చేయడం.. ఇలా వంశీ సీన్స్ సినిమాలో బాగా హైలెట్ అయ్యాయి. గతంలో కొన్ని టీవీ షోల్లో కనిపించిన వంశీ ఇప్పుడు తన తొలి సినిమానే సమంత పక్కన చేశాడు. నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో వంశీకి మంచి పేరొచ్చింది. ఈ నేపథ్యంలోనే వంశీ గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఇమ్మాన్యుయేల్.

ఇవి కూడా చదవండి

సోదరుడితో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్..

‘నేను ఎంత సంపాదించినా, ఎక్కడికి వెళ్లినా నా జీవితంలో ఏదో ఒక వెలితి ఉండేది. నా అన్న లైఫ్ లో సక్సెస్ అవుతాడని నేను చాలా కలలు కన్నాను. దాని కోసం నేను వీడిని బాగా తిట్టేవాడిని. ఎంతలా అంటే ఒకటైంలో నన్ను శత్రువులా చూసి నాతో మాట్లాడటం కూడా మానేసేవాడు. నువ్వు అది చేయ్, ఇది చేయ్, నువ్వు అలా ఉండు, ఇలా ఉండు.. సంపాదించడం స్టార్ట్ చేయమని తొక్కడం స్టార్ట్ చేశా. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నిన్న వాడి సినిమా (మా ఇంటి బంగారం) చూసి ప్రశాంతంగా పడుకున్నాను’అంటూ అన్నయ్యని హత్తుకున్నాడు ఇమ్మూ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

మా ఇంటి బంగారం సినిమాలో ఇమ్మాన్యుయేల్ సోదరుడు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
కలలో కొత్త ఇల్లు కనిపిస్తే శుభమా? అశుభమా? స్వప్న శాస్త్రం ఏమి..
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
వర్షంలో వెళ్తున్న బస్సు ఒక్కసారిగా బోల్తా!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
కలల కోసం అమెరికా.. క్షణాల్లో కూలిన జీవితం..!
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా