Vijay Thalapathy: విజయ్ దళపతి చెల్లిగా నటించిన ఈ అమ్మడు గుర్తుందా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్..
సినీరంగంలో స్టార్ హీరోలకు చెల్లెల్లుగా నటించి.. ఆ తర్వాత హీరోయిన్లుగా మారిన తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్న అమ్మాయి సైతం తుపాకీ చిత్రంలో విజయ్ చెల్లిగా నటించింది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలతో మెంటలెక్కిస్తుంది. ఇంతకీ ఈ అమ్ముడు మీకు గుర్తుందా..? ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి గురించి సౌత్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది స్టార్ హీరోలకు చెల్లిగా నటించింది. శింబు, విజయ్ దళపతి చెల్లెలుగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు క్యూట్ గా కనిపించిన ఆమె.. ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. నిత్యం నెట్టింట గ్లామర్ ఫోటోషూట్లతో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే సంజన సారథి. 2012లో డైరెక్టర్ బాలాజీ శక్తివేల్ దర్శకత్వం వహించిన ‘వక్షకు ఎన్ 18/9’ చిత్రంతో తమిళ సినిమాలో నటిగా అరంగేట్రం చేసింది.ఇందులో ఆమె హీరోయిన్ స్కూల్ ఫ్రెండ్‌గా నటించింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..
ఆ తర్వాత ఎ.ఆఱ్ మురగదాస్ దర్శకత్వంలో విజయ్ నటించిన తుపాకి చిత్రంలో నటించింది. ఇందులో విజయ్ చెల్లిగా కనిపించింది. ఈ సినిమాతోనే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె 2013లో విడుదలైన ‘ఎన్రెన్నుమ్ పున్నాగ’ చిత్రం లో కనిపించింది. ఇందులో జీవా, త్రిష, వినయ్ నటించగా.. త్రిష చెల్లెలిగా కనిపించింది. ఈ సినిమా తర్వాత 2021లో ప్రో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించారు. అలాగే 2023లోవచ్చిన వారసుడు సినిమాలోనూ కనిపించింది.
ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓవైపు సినిమాలతోపాటు..మరోవైపు వెబ్ సిరీస్ సైతం చేస్తుంది. ఇప్పటివరకు ఫింగర్‌టిప్, టైమ్ ఎన్న పాస్, మిస్‌మ్యాచ్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో కట్టిపడేస్తుంది సంజనా. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు జనాలు.
ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‌ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‌తో బ్యాచిలర్ పార్టీ..








