KGF Chapter 1: కేజీఎఫ్ సినిమాలో జూనియర్ యష్‎గా నటించిన కుర్రాడు గుర్తున్నాడా..? ఇప్పుడు హీరో రేంజ్ కటౌట్‏తో..

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ తర్వాత వచ్చిన సెకండ్ పార్ట్ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.

KGF Chapter 1: కేజీఎఫ్ సినిమాలో జూనియర్ యష్‎గా నటించిన కుర్రాడు గుర్తున్నాడా..? ఇప్పుడు హీరో రేంజ్ కటౌట్‏తో..
Anmol
Follow us
Rajitha Chanti

|

Updated on: May 28, 2024 | 11:41 AM

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ అత్యధిక వసూళ్లు రాబట్టి రికార్డ్ సృష్టించింది. రాజమౌళి రూపొందించిన బాహుబలి తర్వాత ఆ రేంజ్ సెన్సెషన్ క్రియేట్ చేసిన సినిమా ఇదే. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు ఇప్పటికీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కేజీఎఫ్ తర్వాత వచ్చిన సెకండ్ పార్ట్ సైతం భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 3 కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఇందులో విలన్ పాత్రలో సంజయ్ దత్ నటించిన సంగతి తెలిసిందే.

ఇదంతా పక్కన బెడితే కేజీఎఫ్ సినిమాలో యష్ చిన్ననాటి పాత్రలో ఓ కుర్రాడు కనిపించిన సంగతి తెలిసిందే. చిన్నవయసులోనే తల్లిని పోగొట్టుకుని విలన్స్ తో పోరాటం చేసిన ఆ కుర్రాడి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేజీఎఫ్ సినిమాలో ఆ చిన్నోడు కనిపించిన సీన్స్ కీలకంగా మరిన సంగతి తెలిసిందే. ఆ మూవీలో జూనియర్ యష్ పాత్రలో కనిపించిన ఆ కుర్రాడి పేరు అన్మోల్ విజయ్ బత్కల్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్న అన్మోల్ కన్నడలో పలు చిత్రాల్లో నటించాడు.

కానీ కేజీఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న అన్మోల్ .. తొమ్మిదేళ్ల వయసు నుంచే నాట్యం నేర్చుకుంటున్నాడట. కేజీఎఫ్ తర్వాత నటనకు దూరంగా ఉన్న అన్మోల్ తన చదువుపై దృష్టి పెట్టాడు. ఇక ఇప్పుడు అన్మోల్ లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. ఒకప్పుడు చిన్నారి యష్ గా కనిపించిన అన్మోల్ ఇప్పుడు మాత్రం హీరో రేంజ్ కటౌట్‏తో కనిపిస్తున్నాడు. అన్మోల్ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

నటనే కాకుండా స్టంట్స్ చేయడం.. డాన్స్ చేయడమంటే అన్మోల్ కు చాలా ఇష్టమట. సోషల్ మీడియాలో ఎక్కువగా తాను డాన్స్ చేసిన వీడియోస్ పంచుకుంటున్నాడు. అలాగే అన్మోల్ కఠినమైన వ్యాయామాలు కూడా చేసేందుకు ఇష్టపడుతుంటాడు. ఇప్పుడిప్పుడే అన్మోల్ తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో అన్మోల్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Anmol (@anmol_._bhatkal)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.