Pawan Kalyan: నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్.. ఏ మూవీ అంటే..
ముఖ్యంగా నాగార్జునకు ఫ్యామిలీ అడియన్స్ నుంచి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ టాలీవుడ్ మన్మథుడు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, మాస్ యాక్షన్, భక్తిరస చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నాగ్ కెరీర్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను కూడా వదులుకున్నారు.
అక్కినేని నాగార్జున తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెరంగేట్రం చేసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా నాగార్జునకు ఫ్యామిలీ అడియన్స్ నుంచి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ టాలీవుడ్ మన్మథుడు అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్, మాస్ యాక్షన్, భక్తిరస చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ నాగ్ కెరీర్లో కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను కూడా వదులుకున్నారు. టాప్ డైరెక్టర్ చెప్పిన కంటెంట్ నచ్చినప్పటికీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల పలు చిత్రాలను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. అలా నాగ్ వదులుకున్న సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.
అదే బద్రి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. నిజానికి బద్రి సినిమాకు నాగార్జున చేయాల్సిందట. బద్రి సినిమా కథను డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముందుగా నాగార్జునకే చెప్పారట. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారట. దీంతో ఈ స్టోరీ పవన్ వద్దకు వెళ్లింది. అయితే బద్రి సినిమా క్లైమాక్స్ మార్చి తీసుకురావాలని పవన్ కండిషన్ పెట్టారట. దీంతో పవన్ క్లైమాక్స్ సరిగ్గా వినలేదు అనుకుని.. తర్వాతి రోజు అదే స్టోరీని వినిపించారట.
బద్రి స్టోరీ పూర్తిగా విన్న పవన్.. అసలు క్లైమాక్స్ మార్చలేదు కదా.. నిన్న విన్న స్టోరీ మళ్లీ చేప్పావు అని అడగడంతో అసలు విషయం చెప్పారట పూరి. తనకు క్లైమాక్స్ మార్చడం అసలు ఇష్టం లేదని.. స్టోరీ సరిగ్గా వినలేదేమో అని భావించి మళ్లీ చెప్పినట్లు తెలిపారట. దీంతో పూరి కాన్ఫిడెంట్ నచ్చి బద్రి సినిమా చేశారట. ఒకవేళ తాను చెప్పినట్లు క్లైమాక్స్ మార్చితే ఈ సినిమాను చేయాకూడదని అనుకున్నారట పవన్. చివరకు పూరి క్లైమాక్స్ మార్చకపోవడంతో ఈ సినిమాలో నటించారు పవన్. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.