Richa Gangopadhyay : మిర్చి సినిమాలో ప్రభాస్ జోడిగా కనిపించిన హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ్. ఇందులో రానా దగ్గుబాటి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినా.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. దీంతో అటు రిచాకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో మాత్రం మంచి అవకాశాలు అందుకుంది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో మిర్చి ఒకటి. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013 ఫిబ్రవరి 8న విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇందులో అనుష్క, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్లుగా నటించగా.. సత్యరాజ్, నదియా కీలకపాత్రలు పోషించారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ గురించి చెప్పక్కర్లేదు. ఈసినిమాలో అనుష్కతోపాటు అందం, అభినయంతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్. తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన రిచాకు మిర్చి సినిమా మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన రిచా.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇప్పుడు ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా రిచాకు సంబంధించిన కొన్ని ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లీడర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రిచా గంగోపాధ్యాయ్. ఇందులో రానా దగ్గుబాటి హీరోగా నటించిన సంగతి తెలిసిందే. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చినా.. కమర్షియల్ హిట్ కాలేకపోయింది. దీంతో అటు రిచాకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో మాత్రం మంచి అవకాశాలు అందుకుంది. మాస్ మహారాజా రవితేజ సరసన మిరపకాయ్ చిత్రంలో గ్లామర్ బ్యూటీగా మెరిసింది. ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన మిర్చి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో నాగవల్లి, బాయ్, సారొచ్చారు చిత్రాల్లో నటించి తెలుగువారికి దగ్గరయ్యింది.
ఈ సినిమాల తర్వాత వరుస ఆఫర్స్ వస్తూ కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే.. తన స్నేహితుడు జో లాంగెల్లాను ప్రేమించి పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంది. 2019లో వీరిద్దరి వివాహం ఘనంగా జరగ్గా.. వీరికి 2021లో లూకా షాన్ లాంగెల్లా అనే బాబు జన్మించాడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న రిచా.. తన కొడుకు ఆలనా పాలనా చూసుకుంటుంది. అలాగే సోషల్ మీడియాలో తనక కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.