Tollywood: ఇలా తయారయ్యారేంట్రా బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ పై ట్రోలింగ్.. పోలీసులకు తండ్రి ఫిర్యాదు..
ఈ సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీస్ లైఫ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం సినీతారల గురించి ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా హీరోయిన్స్ పై దారుణంగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ కాకుండా చైల్డ్ ఆర్టి్స్ట్స్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. నెట్టింట కొందరు చేసే ట్రోలింగ్ భరించలేక ఓ బాలనటి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
సోషల్ మీడియా జనాల జీవితాలను మార్చేస్తుంది. కొందరిని ఫేమస్ చేస్తే.. మరికొందరిని మానసికంగా చిత్రవధ చేస్తుంది. నెట్టింట కాస్త ఫేమస్ అయితే చాలు వెంటనే వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. వారి లుక్స్, లైఫ్ స్టైల్ గురించి ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తూ మెంటల్ టార్చర్ చేస్తుంటారు. ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచంలో సెలబ్రెటీస్ లైఫ్ గురించి చెప్పక్కర్లేదు. నిత్యం సినీతారల గురించి ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. సినిమాలు హిట్ అయినా.. ప్లాప్ అయినా హీరోయిన్స్ పై దారుణంగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ కాకుండా చైల్డ్ ఆర్టి్స్ట్స్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. నెట్టింట కొందరు చేసే ట్రోలింగ్ భరించలేక ఓ బాలనటి తండ్రి పోలీసులను ఆశ్రయించారు.
మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మల్లికాపురం. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద ప్రధాన పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. మలయాళంలో అనేక చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. ఇటీవల దేవానంద నిటంచిన గు అనే హారర్ మూవీలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన ఇంటి వద్దే ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది దేవానంద. ఇక ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలను కొందరు తమ ఇష్టానుసారంగా షేర్ చేస్తూ తప్పుడు థంబ్ నైల్స్ పెడుతూ ఆ చిన్నారి మాటలను తప్పుగా ప్రచారం చేస్తున్నారట. దీనిపై ఆ బాలనటి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ కూతురి మాటలను తప్పుగా ప్రచారం చేస్తూ.. తమ కుటుంబ పరువును తీసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటర్వ్యూలోని ఒక పార్ట్ కట్ చేసి తమ కూతురిపై బురద చల్లుతున్నారని మండిపడ్డాడు. సోషల్ మీడియా విమర్శల కారణంగా తన కూతురు మానసికంగా ఎంతో బాధపడుతుందని.. తమ కూతురి గురించి ఉద్దేశపూర్వకంగా వీడియోస్, కామెంట్స్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.