Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Santhosham Movie: సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా ?.. ఇప్పుడేలా ఉన్నాడంటే..

అక్కినేని నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా శరన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2002లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో డైరెక్టర్ కె. విశ్వనాథ్, ప్రభుదేవా కీలకపాత్రలలో నటించారు. వీరితోపాటు.. నాగ్ తనయుడిగా ఓ బుడ్డొడు కూడా కనిపించాడు. అప్పట్లో ఈ చిన్నొడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Santhosham Movie: సంతోషం సినిమాలో నాగార్జున కొడుకుగా నటించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా ?.. ఇప్పుడేలా ఉన్నాడంటే..
Santhosham Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 31, 2022 | 11:16 AM

బాలనటులుగా వెండితెరపై సందడి చేసి.. అమాయకపు చూపులు.. అల్లరి.. అద్బుతమైన నటనతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు అనేకం. బేబి షాలిని, షామిని, మీనా, శ్రీదేవి, నిత్యా మీనన్ వంటి తారలే కాకుండా.. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై హీరోహీరోయిన్స్ గా రాణిస్తున్నారు. అలాగే మరికొందరు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వారిలో సంతోషం చిన్నోడు ఒకరు. అక్కినేని నాగార్జున, గ్రేసీ సింగ్, శ్రియా శరన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా 2002లో విడుదలైన సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో డైరెక్టర్ కె. విశ్వనాథ్, ప్రభుదేవా కీలకపాత్రలలో నటించారు. వీరితోపాటు.. నాగ్ తనయుడిగా ఓ బుడ్డొడు కూడా కనిపించాడు. అప్పట్లో ఈ చిన్నొడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ అబ్బాయి పేరు ఏంటీ అనుకుంటున్నారా ?.. అతని పేరు అక్షయ్.

అక్షయ్.. 1997లో మే 13న జన్మించారు. బాలనటుడిగా కెరీర్ ఆరంభించించిన అక్షయ్.. తెలుగులో 12 చిత్రాల్లో నటించారు. అలాగే.. హిందీలో 35 చిత్రాల్లో నటించి మెప్పించాడు. తెలుగు, కన్నడ చిత్రాలలో మెరిసిన తర్వాత, అక్షయ్ బచ్చు 2005లో అంజానే చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు . కేవలం సినిమాల్లోనే కాదు.. ప్రకటనలలోనూ కనిపించాడు. నటనే కాకుండా.. అతను సింగర్ కూడా. పలు స్టేజ్ షోలలో గాయకుడిగా ఎన్నో సాంగ్స్ ఆలపించాడు. అతనికి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. నాగార్జున నటించిన సంతోషం మాత్రమే కాకుండా ప్రభాస్ నటించిన వర్షం చిత్రంలోనూ కనిపించాడు. పలు ప్రకటనలలో MS ధోనితో డాబర్ చ్యవన్‌ప్రాష్ ప్రకటన, స్టేట్ బ్యాంక్ హోమ్ లోన్లు, క్వాలిటీ వాల్ యొక్క ఐస్ క్రీం, ఫ్లెయిర్ పెన్, నెస్లే చాకోస్టిక్, కలర్‌స్టిక్ స్కెచ్ పెన్నులు, అస్లీ ఆటా వంటి వాటిలో కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.