Jagadam Movie: ద్యావుడా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన జగడం హీరోయిన్.. ఇప్పుడు ఎట్టా ఉందంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలలో యంగ్ సక్సెస్ ఫుల్ హీరోలలో రామ్ పోతినేని ఒకరు. దేవదాసు సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన ఆయన.. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో అలరించిన రామ్.. ఇప్పుడు సరైన బ్రేక్ చూస్తున్నాడు. రామ్ నటించిన ఎన్నో చిత్రాల్లో జగడం ఒకటి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన చిత్రాల్లో జగడం ఒకటి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ సినిమాపై మాత్రం దర్శకధీరుడు రాజమౌళి సైతం ప్రశంసలు కురిపించారు. సుకుమార్ డైరెక్షన్, రామ్ యాక్టింగ్ అదిరిపోయాయి. అలాగే ఈ చిత్రంలోని సన్నివేశాలు, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ అయ్యింది. ఈ సినిమాలోని అన్నీ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమా వస్తే కదలకుండా చూస్తుండిపోతారు జనాలు. సుకుమార్ కెరీర్ లోనే ఈ సినిమా ప్రత్యేకం.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో రామ్ పోతినేని సరసన నటించిన హీరోయిన్ ఇషా సహానీ. ఈ మూవీతో చాలా ఫేమస్ అయ్యింది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో కట్టిపడేసింది. అప్పట్లో ఆమె అందానికి యూత్ ఫిదా అయ్యారు. అలాగే తక్కువ సమయంలోనే కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. అయితే జగడం సినిమా డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి సైతం తెలుగులో ఆఫర్స్ రాలేదు. దీంతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. జగడం తర్వాత మరో మూవీలో కనిపించలేదు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో ఆమె కోసం సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.
జగడం తర్వాత తమిళంలో బ్యాడ్ బాయ్ అనే సినిమా చేసింది. ఇషా సహానీ మంచి డ్యాన్సర్. కెరీర్ ప్రారంభంలో దక్షా సేత్ డ్యాన్స్ కంపెనీలో మెయిన్ డ్యాన్సర్ గా పనిచేసేది. అలాగే స్టేజ్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ విడుదల చేసిన టాప్ 100 సెలబ్రెటీస్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగులో జగడం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుని లండన్ లో సెటిల్ అయ్యింది. అక్కడే ఓ డ్యాన్స్ స్కూల్ నడుపుతుంది. తాజాగా ఇషా సహానీ ఫోటోస్ నెట్టింట సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

Isha Sahani
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన







