Darling Movie: డార్లింగ్ సినిమాలో ప్రభాస్‌ను ఆటపట్టించిన చిన్నోడు గుర్తున్నాడా..? ఇప్పుడేం చేస్తున్నాడంటే..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన చిన్నారులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అందులో గౌరవ్ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.. కానీ డార్లింగ్ సినిమాలో ప్రభాస్‌ను ఆటపట్టించిన చిన్నోడు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో తన అల్లరితో ప్రేక్షకులను నవ్వించాడు.

ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో చైల్ట్ ఆర్టిస్టులుగా కెరీర్ ప్రారంభించినవారు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా రాణిస్తున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలా మంది బాలనటులు ఇప్పుడు వెండితెరపై అలరిస్తున్నారు. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన చిన్నారులు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. తేజా సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ సూపర్ హిట్స్ అందుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించినవారు ఇప్పుడు తిరిగి హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అందులో గౌరవ్ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.. కానీ డార్లింగ్ సినిమాలో ప్రభాస్‌ను ఆటపట్టించిన చిన్నోడు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ మూవీలో తన అల్లరితో ప్రేక్షకులను నవ్వించాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ కరుణాకరన్ కాంబోలో వచ్చిన సినిమా డార్లింగ్. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో కాజల్ కథానాయికగా నటించగా.. చంద్రమోహన్, ఎంఎస్ నారాయణ, ప్రభు, ఆహుతి ప్రసాద్, శ్రద్ధా దాస్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్, మేనరిజంకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో కాజల్ తమ్ముడిగా కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ గౌరవ్. ఇందులో ప్రభాస్, గౌరవ్ మధ్య వచ్చే ఫన్నీ సీన్స్ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను ఆటపట్టించడం.. ఆ సమయంలో డార్లింగ్ ఎక్స్ప్రెషన్స్ నవ్వులు పూయించాయి. డార్లింగ్ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిన గౌరవ్ తెలుగులో అనేక చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించాడు. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం సినిమాలోనూ కనిపించాడు.
డార్లింగ్ కంటే ముందు ఎన్నో స్టేజ్ షోలలో, డాక్యుమెంటరీలలో నటించాడు. మాస్ మహారాజా రవితేజ, అనుష్క జంటగా నటించిన బలాదూర్ సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన నటనతో దాదాపు 20కి పైగా సినిమాల్లో కనిపించాడు. కానీ డార్లింగ్ సినిమాతోనే మంచి పేరు వచ్చింది. ఇక ఇప్పుడు పెరిగి పెద్దవాడైన గౌరవ్ మళ్లీ సినిమాల్లోనే కీలకపాత్రలు పోషిస్తున్నాడు. గౌరవ్.. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న కన్నప్ప సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




