AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teen Maar: హాట్ ఫొటోలతో మెంటలెక్కిస్తోన్న తీన్ మాన్ హీరోయిన్.. పెళ్లైన తర్వాత పెరిగిన జోరు..  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. డైరెక్టర్ జయంత్ సి పర్జానీ కాంబోలో వచ్చిన సినిమా తీన్ మాన్. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో త్రిష, కృతి కర్బందా, సోనూసూద్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.

Teen Maar: హాట్ ఫొటోలతో మెంటలెక్కిస్తోన్న తీన్ మాన్ హీరోయిన్.. పెళ్లైన తర్వాత పెరిగిన జోరు..  
Krithi New
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2024 | 8:28 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష జంటగా నటించిన చిత్రం తీన్ మాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించుకుందాం రా.. బావగారూ బాగున్నారా వంటి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తెరకెక్కించిన ప్రేక్షకులను అలరించిన డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దశాబ్దకాలం క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ చిత్రం పవన్ అభిమానులను నిరాశపరిచింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ పోషించగా.. త్రిషతోపాటు మరో హీరోయిన్ కృతి కర్బందా, సోనూ సూద్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాకు తెలుగు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయిన ఈ సినిమా మ్యూజిక్ పరంగా మాత్రం శ్రోతలను మెప్పించింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి.ఈ సినిమాకు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. ఇప్పటికీ ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమాలో పవన్, కృతి మధ్య వచ్చే లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన కృతి కర్బందా… అంతకు ముందే తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ.. మంచు మనోజ్ సరసన మిస్టర్ నూకయ్యా… రామ్ పోతినేని ఒంగోలు గిత్త వంటి చిత్రాల్లో మెరిసింది. అయినప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ మాత్రం రాలేదు. బ్రూస్ లీ చిత్రంలో రామ్ చరణ్ సోదరిగా నటించింది. కన్నడలో యష్ తో కలిసి గూగ్లీ సినిమాతో విజయాన్ని అందుకున్న కృతి ఇటీవలే పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రాలేదు.

బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది కృతి. కృతి, పుల్కిత్‌ సామ్రాట్‌ కలిసి తైష్, పాగల్ పంటి, వీరే ది వెడ్డింగ్ చిత్రాల్లో నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న కృతి.. ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. నిత్యం గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు ఫ్యాన్స్. పుల్కిత్ సామ్రాట్ గతంలో శ్వేతా రోహిరాను 2014లో వివాహం చేసుకోగా.. మనస్పర్థలతో వీరు 2018లో విడిపోయారు.

ఇది చదవండి :  Mathu Vadalara 2 Riya: హే.. రియా నువ్వు ఆ షార్ట్ ఫిల్మ్ చేశావా.. ? ఆ ఒక్క వీడియోతో ఫేమస్ చేసిందిగా..

Prema Kavali : వారెవ్వా.. ఏం మారింది భయ్యా.. నెట్టింట గత్తరలేపుతోన్న ప్రేమ కావాలి హీరోయిన్..

Aadi Movie: ఆది సినిమాలో ఈ నటి గుర్తుందా.. ? ఇప్పటికే అదే అందంతో మెస్మరైజ్ చేస్తోందిగా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.