అప్పట్లో కుర్రకారుకు తెగ నచ్చేసిన ‘ఒకరికి ఒకరు’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి చాబ్రియా. పేరు చెబితే ఠక్కున గుర్తుకు రాదు కానీ శ్రీరామ్‌ హీరోగా వచ్చిన 'ఒకరికి ఒకరు' సినిమా హీరోయిన్‌ క్యారెక్టర్‌ సుబ్బలక్ష్మి అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రసూర్‌ ఎల్లోర్‌..

అప్పట్లో కుర్రకారుకు తెగ నచ్చేసిన 'ఒకరికి ఒకరు' హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Okariki Okaru Movie
Follow us
Basha Shek

|

Updated on: May 12, 2023 | 6:12 AM

కొందరు హీరోయిన్లు కొన్ని సినిమాలే చేస్తారు. ఆ తర్వాత పెళ్లి, పిల్లలు లేదా ఇతర కారణాలతో సినిమా ఇండస్ట్రీకి దూరమైపోతారు. అలా తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆర్తి చాబ్రియా. పేరు చెబితే ఠక్కున గుర్తుకు రాదు కానీ శ్రీరామ్‌ హీరోగా వచ్చిన ‘ఒకరికి ఒకరు’ సినిమా హీరోయిన్‌ క్యారెక్టర్‌ సుబ్బలక్ష్మి అంటే ఇట్టే గుర్తుకు వస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ రసూర్‌ ఎల్లోర్‌  తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్ లవ్‌ స్టోరీ అప్పట్లో బాగానే ఆడింది. ముఖ్యంగా ఇందులోని ‘ఎక్కడున్నావమ్మా’, ‘నువ్వే నా శ్వాస’ పాటలు ఇప్పటికీ చాలామంది ఫేవరెట్‌ సాంగ్స్‌. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆర్తి చాబ్రియాకు మంచి గుర్తింపు వచ్చింది. తన అందం, అభినయంతో యూత్‌కు తెగ నచ్చేసింది. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ మొదట మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆతర్వాత మధురక్షణం అనే తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. మధ్యలో కొన్ని హిందీ సినిమాలు చేసినా ఒకరికి ఒకరు సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, చింతకాయల రవి, గోపి- గోడమీద పిల్లి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. హిందీలోనూ ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, రాజా భయ్యా, షాదీ నంబర్‌వన్‌, హే బేబీ వంటి హిట్‌ సినిమాల్లో నటించి మెప్పించింది.

కాగా 2013 తర్వాత సినిమాలకు దూరమైన ఆర్తి ఛాబ్రియా 2019లో ఆస్ట్రేలియాకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ విశారద్ బీదాస్సీని వివాహం చేసుకుంది. అన్నట్లు ఆర్తిలో యాక్టింగ్‌తో పాటు మరో ట్యాలెంట్‌ ఉంది. ఆమె మంచి మోటివేషనల్‌ స్పీకర్‌ కూడా. ప్రస్తుతం విక్టోరియస్‌ మైండ్‌ పవర్‌ అనే ఆన్‌లైన్‌ కోచింగ్‌ ప్లాట్‌ ఫామ్ కు  ఫౌండర్‌గా వ్యవహరిస్తుందామె. కాగా సినిమాలకు దూరంగా ఉన్న ఆర్తి సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోస్‌, వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకుంటుంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు ‘ఆర్తి అప్పటికీ, ఇప్పటికీ అలాగే ఉంది. వావ్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్తి చాబ్రియా లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..