Tollywood : తస్సాదియ్యా.. అప్పుడు క్యూట్‌గా.. ఇప్పుడు హాట్‌గా.. జై చిరంజీవా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ?
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మెప్పిస్తున్నారు. శ్రీవిద్య, తేజా సజ్జా, కావ్య కళ్యాణ్ రామ్ వంటి తారలు ప్రస్తుతం మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ? ఒక్క సినిమాతోనే చాలా ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా.. ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో జై చిరంజీవా ఒకటి. డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భుమిక, సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించగా..ఈ సినిమాలో చిరు కామెడీ టైమింగ్ అదిరిపోయింది. అలాగే ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకులను ఏడిపించారు చిరు. ఇక ఈ సినిమాలో మరింత హైలెట్ అయ్యింది అంటే చిరు మేనకోడలుగా నటించిన చిన్నారి. తన మావయ్యతో కలిసి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈసినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఆమె పేరు శ్రియ శర్మ. చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. నువ్వు నేను ప్రేమ సినిమాలో సూర్య, జ్యోతిక కూతురిగా కనిపించింది. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవా మూవీలో కనిపించింది.
ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు నటించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో కనిపించింది. అలాగే గాయకుడు అనే మూవీలో కథానాయికగా మెప్పించింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమాల్లో అంతగా ఆఫర్స్ రాలేదు. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్లను మించిన అందంతో ఆకట్టుకుంటుంది. హిమాచల్ ప్రదేశ్ లో జన్మించిన ఈ బ్యూటీ.. తండ్రి ఇంజనీర్ కాగా.. ఆమె తల్లి డైటీషియన్.
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన శ్రియా శర్మ.. ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తుంది. సినిమాల కంటే ఎక్కువగా ఆమె తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం శ్రియ శర్మ క్రేజీ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
View this post on Instagram
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన