Child Artist: అతడు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ హీరో అయ్యాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
చైల్డ్ ఆర్టిస్టులుగా సినీరంగంలో చక్రం తిప్పిన చాలా మంది ఇప్పుడు హీరోహీరోయిన్లుగా మారారు. తెలుగు, హిందీ, తమిళం ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు వెండితెరపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అతడు. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ డైలాగ్స్ హైలెట్ అయ్యాయి. ఇందులో త్రిష కథానాయికగా నటించగా.. సోనుసూద్, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒకచోటు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ సినిమాలో తన నటనతో నవ్వించిన చైల్డ్ ఆర్టిస్టు గుర్తున్నాడా.. ? అమాయకత్వం.. తన నటనతో అలరించాడు. ముఖ్యంగా ఈ చిన్నోడికి.. బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. ఆ చిన్నోడి పేరు దీపక్ సరోజ్.
అతడు మూవీతో చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయ్యాడు దీపక్ సరోజ్. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఆర్య, భద్ర, మినుగురులు, లెజెండ్ వంటి చిత్రాల్లో నటించారు. చాలా సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన కుర్రాడు.. ఇప్పుడు హీరోగా మారాడు. ఇటీవలే డైరెక్టర్ వి. యశస్వి దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో హీరోగా సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇన్నాళ్లు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన దీపక్ హీరోగా నటించిన రెండవ చిత్రం ఇదే.
ఇవి కూడా చదవండి: Damarukam movie: ఢమరుకం మూవీ విలన్ గుర్తున్నాడా.. ? అతడి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్..
Shopping Mall : షాపింగ్ మాల్ సినిమాలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఇప్పుడేం చేస్తుందంటే..
అంతకు ముందు బంధనం అనే సినిమాలో హీరోగా నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. దీంతో అతడికి అంతగా గుర్తింపు రాలేదు. తెలుగులో రెండు సినిమాల్లోనే హీరోగా కనిపించిన దీపక్.. ఆతర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తున్నాడు.
View this post on Instagram
Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..
Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..
Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..








