Janaki weds sriram Movie: జానకీ వెడ్స్ శ్రీరామ్ సినిమా హీరో గుర్తున్నాడా.. ? ఇండస్ట్రీకి దూరంగా.. ఇప్పుడేం చేస్తున్నాడంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలో చాలా ఉన్నాయి. ఇప్పటికీ.. ఎప్పటికీ అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన చిత్రాల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి సినిమాల్లో జానకీ వెడ్స్ శ్రీరామ్ ఒకటి. ఇప్పుడు ఈ సినిమా వస్తుందంటే చాలు జనాలు టీవీలకు అతుక్కుపోతుంటారు.

తెలుగు సినిమా ప్రపంచంలో ప్రేమకథ చిత్రాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అనేక సినిమాలు అడియన్స్ హృదయాలను గెలుచుకున్నాయి. నిజానికి ప్రేమకథ సినిమాల్లో ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని చిత్రాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో జానకీ వెడ్స్ శ్రీరామ్ ఒకటి. 90’s కిడ్స్ ఫేవరెట్ చిత్రాల్లో ఇది ఒకటి. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. చిన్నా, పెద్ద, యూత్ ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది. ప్రతీ ఒక్కరూ ఈ చిత్రానికి ఎంతగానో కనెక్ట్ అయ్యారు. అందమైన ప్రేమకథతోపాటు ఫ్యామిలీ బాండింగ్స్, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కనెక్ట్ చేశాయి. ఈ చిత్రానికి అంజి శ్రీను దర్శకత్వం వహించగా.. రోహిత్ హీరోగా నటించారు.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
అలాగే ఈ సినిమాలో గజాల, రేఖ హీరోయిన్లుగా నటించారు. సినిమాతోపాటు ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ యూట్యూ్బ్ లో ఈ సాంగ్స్ మారుమోగుతుంటాయి. ఇదెలా ఉంటే.. జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమాలో హీరోగా నటించిన రోహిత్ గుర్తున్నాడా.. ? చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. రోహిత్.. సినీరంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీప్రయాణం స్టార్ట్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ్ దగ్గర సహయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలుగు స్వర్ణక్క, నువ్వే కావాలి, సొంతం చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 2001లో వచ్చిన 6 టీన్స్ సినిమాతో హీరోగా మారాడు. ఫస్ట్ మూవీ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ హీరోగా రోహిత్ మంచి మార్కులు కొట్టేశాడు. తెలుగులో ముత్యం, చంద్రవంశం, గర్ల్ ఫ్రెండ్ వంటి సినిమాల్లో నటించిన రోహిత్.. సొంతం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..
కానీ హీరోగా అతడికి మరింత క్రేజ్ తెచ్చిపెట్టిన సినిమా జానకీ వెడ్స్ శ్రీరామ్. ఈ సినిమా రోహిత్ కెరీర్ మలుపు తిప్పింది. ఆ తర్వాత నేను సీతామహాలక్ష్మీ, శంకర్ దాదా ఎంబీబీఎస్, కీలుగుర్రం, నవవసంతం సినిమాలతో అలరించారు. చివరకు RAM చిత్రంలో కనిపించిన రోహిత్.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు.. అటు సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?

Rohit
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..




