Shoban Babu: టాలీవుడ్ ‘సోగ్గాడు’ శోభన్ బాబు కొడుకును హీరో ఎందుకు చేయలేదో తెలుసా ?.. వాళ్లు ఏం చేస్తున్నారంటే..

తెలుగు ప్రేక్షకులు తనను ఓ హీరోగానే గుర్తుపెట్టుకోవాలని.. తనను ఎప్పటికీ ఓ సోగ్గాడిగానే చూడాలని సహాయ నటుడిగా కనిపించలేదు శోభన్ బాబు. 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు. అయితే స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

Shoban Babu: టాలీవుడ్ 'సోగ్గాడు' శోభన్ బాబు కొడుకును హీరో ఎందుకు చేయలేదో తెలుసా ?.. వాళ్లు ఏం చేస్తున్నారంటే..
Shoban Babu
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2023 | 10:42 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో శోభన్ బాబు. ప్రేమ కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అందాల నటుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కేవలం హీరోయిజం మాత్రమే కాదు.. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించారు ఆయన. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయకుడిగా కొనసాగారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన.. కాస్త వయసు పెరగ్గానే సినిమాలకు దూరమయ్యారు. అయితే సహాయ నటుడిగా శోభన్ బాబుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగు ప్రేక్షకులు తనను ఓ హీరోగానే గుర్తుపెట్టుకోవాలని.. తనను ఎప్పటికీ ఓ సోగ్గాడిగానే చూడాలని సహాయ నటుడిగా కనిపించలేదు శోభన్ బాబు. 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు. అయితే స్టార్ హీరోగా వెలుగు వెలిగిన శోభన్ బాబు కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.

అందాల నటుడి కుమారుడు కూడా అచ్చం హీరోగానే ఉన్నాడు. కానీ చిత్రపరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టలేదు. ఇందుకు ప్రధాన కారణం మాత్రం ఉందట. తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఎంతోమంది శోభన్ బాబును అడిగారట. అందుకు ఆయన మాత్రం ఒప్పుకోలేదట. అప్పట్లో నటుడు రాజా రవీంద్ర.. శోభన్ బాబును ఇదే ప్రశ్న అడిగారట. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు రాజా రవీంద్ర. ఆయన అడిగిన ప్రశ్నకు శోభన్ బాబు మాట్లాడుతూ తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎంతగానో కష్టపడ్డానని.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. సక్సెస్ అయినప్పటికీ కూడా చాలా ఒత్తిడికి గురయ్యేవాడినని అన్నారట.

నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు. ప్రతి సినిమాకు ముందు ఎంత సూపర్ స్టార్ అయినా టెన్షన్ పడుతుంటాడు. ఆ టెన్షన్ నా కొడుకుకు వద్దు. నా పిల్లలు ప్రశాంతంగా బతకాలని కోరుకుంటాను. మానసికంగా ఇబ్బంది పడే జీవితం నా పిల్లలకు వద్దు. అందుకే సినిమాలకు దూరంగా ఉంచానని అన్నారట. పిల్లలు.. ఫ్యామిలీ విషయంలో శోభన్ బాబు ఇచ్చిన ప్రాధాన్యత ఎంటో తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పిల్లలు వ్యాపారరంగంలో స్థిరపడినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.