AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఆరుగురు దర్శకులు.. 26 మంది స్టార్స్.. కట్ చేస్తే.. చెత్త సినిమా తీశారు..

6గురు దర్శకులు.. 26 మంది స్టార్ సెలబ్రెటీస్.. రూ.21 కోట్ల పెట్టుబడితో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా అది. కానీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్ చూసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ఆ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి నిర్మాతలు తల పట్టుకున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా.

Cinema : ఆరుగురు దర్శకులు.. 26 మంది స్టార్స్.. కట్ చేస్తే.. చెత్త సినిమా తీశారు..
Dus Kahaniyaan
Rajitha Chanti
|

Updated on: Feb 05, 2026 | 12:04 PM

Share

బడ్జెట్ కాదు.. కంటెంట్ ముఖ్యమని ఇదివరకే చాలా సినిమాలు నిరూపించాయి. ఎలాంటి అంచనాలు, హడావిడి లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్, టాప్ డైరెక్టర్ లేకపోయినా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాయి. అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఓ సినిమా మాత్రం ఊహించని విధంగా పరాజయం చవిచూసింది. ఈ సినిమాలో 26 మంది స్టార్స్ నటించారు. ఆరుగురు డైరెక్టర్స్ తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. 10 విభిన్న కథలతో రూపొందించిన ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని భావించారు. కానీ అంచనాలు తప్పాయి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకులు హన్సల్ మెహతా, మేఘనా గుల్జార్, రోహిత్ రాయ్, సంజయ్ గుప్తా, అపూర్వ లక్కియా, జస్మీత్ తోడి సహా 6 మంది దర్శకులు దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఈ చిత్రంలో సంజయ్ దత్, సునీల్ శెట్టి, నానా పటేకర్, నసీరుద్దీన్ షా, మనోజ్ బాజ్‌పేయి, అర్బాజ్ ఖాన్, జిమ్మీ షెర్గిల్, అమృతా సింగ్, మినీషా లాంబా, సుధాన్షు పాండే, అనుపమ్ ఖేర్ నటించారు. వీరితో పాటు అఫ్తాబ్ శివదాసాని, దియా మీర్జా, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, నేహా ధూపియా, షబానా అజ్మీ, మసూమ్ మఖిజా, రోహిత్ రాయ్, అనితా హస్సానందని, అనురాధ పటేల్, డినో మోరియా, డరీనా పటేల్, నేహా ఒబెరాయ్, నేహా ఒబెరాయ్, అనేక ఇతర నటీనటులు కూడా ఉన్నారు. ఈ బాలీవుడ్ చిత్రంలో పది కథలు ఉన్నాయి, వీటిని ఆరుగురు దర్శకులు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం పేరు “దస్ కహానియన్” (10 కథలు). దీనిలోని ప్రతి భాగం ఒక కథను చెబుతుంది. ఇందులో “స్ట్రేంజర్స్ ఇన్ ది నైట్,” “జహీర్,” “లవ్ టేల్,” “రైస్ ప్లేట్,” “కప్పలూన్స్,” “రైజ్ అండ్ ఫాల్” వంటి 10 విభిన్న కథలు ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

సినీరంగంలో ఆరుగురు దర్శకులు ఒకే సినిమాకు పనిచేయడం ఇదే మొదటిసారి. 2007లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. రూ.21 కోట్లతో నిర్మించిన ఈ మూవీ కేవలం రూ.13 కోట్లు రాబట్టింది. అందుకు కారణం ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే లేకపోవడం అని అప్పట్లో ప్రచారం నడిచింది.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..

Follow Us