AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. ఎలాగో తెలిస్తే మైండ్‌ బ్లాంకే.. సూపర్‌ ట్రిక్‌!

Home Loan: గృహ రుణం ప్రారంభ సంవత్సరాల్లో ముందస్తు చెల్లింపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళుతుంది. అందుకే కొంచెం అదనంగా చెల్లించడం వల్ల అసలు మొత్తం నేరుగా తగ్గుతుంది. మీ ఆదాయం పెరిగేకొద్దీ..

Home Loan: రూ.50 లక్షల గృహ రుణంపై రూ.20 లక్షలు ఆదా.. ఎలాగో తెలిస్తే మైండ్‌ బ్లాంకే.. సూపర్‌ ట్రిక్‌!
Home Loan
Subhash Goud
|

Updated on: Feb 05, 2026 | 7:36 AM

Share

Home Loan: మీరు గృహ రుణం తీసుకోబోతున్నట్లయితే కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇల్లు సొంతం చేసుకోవడం చాలా మందికి పెద్ద కల. ఇది భద్రత, స్థిరత్వాన్ని అందిస్తుంది. కానీ ఇది దీర్ఘకాలిక గృహ రుణం, సంవత్సరాల తరబడి ఉండే EMIలతో వస్తుంది. భారతదేశంలో చాలా గృహ రుణాలు 20 నుండి 30 సంవత్సరాల వరకు ఉంటాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో వడ్డీ మొత్తం తరచుగా ప్రధాన రుణం కంటే ఎక్కువగా ఉంటుంది. చాలా మంది EMIలు చెల్లించడంలో విసిగిపోవడానికి ఇదే కారణం. కానీ నిజమైన ప్రయోజనం బ్యాంకుకే. అటువంటి పరిస్థితిలో ఒక చిన్న ట్రిక్స్‌ ఉపయోగించి ముందస్తు చెల్లింపు మీ జేబుకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది.

తొలి సంవత్సరాలు అత్యంత కష్టతరమైనవి:

గృహ రుణం EMIలో ఎక్కువ భాగం ప్రారంభ సంవత్సరాల్లో వడ్డీకే వెళుతుంది. మీరు 25 సంవత్సరాలు రుణం తీసుకున్నారని అనుకుందాం.. ఆ తర్వాత మొదటి 8-10 సంవత్సరాలలో మీరు ఎక్కువ వడ్డీని చెల్లిస్తుంటారు. మీ జీతం, వయస్సు, ప్రొఫైల్‌ను బట్టి వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటే చెల్లించిన మొత్తం మరింత పెరుగుతుంది.

ఇది కూడా చదవండి: Cash Transaction Rule: ఇంతకు మించి నగదు లావాదేవీలు జరుపుతున్నారా? భారీ పెనాల్టీ తప్పదు!

ఇవి కూడా చదవండి

డబ్బును ఆదా చేసే ముందస్తు ట్రిక్‌ ఇదే:

ఇక్కడే ఒక చిన్న ట్రిక్‌ ఉంది. కానీ దీనిని జాగ్రత్తగా ఉపయోగిస్తే చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చంటున్నారు ఆర్థిక నిపుణులు. మీరు ప్రతి సంవత్సరం ఒక అదనపు EMI చెల్లిస్తే రుణ భారం చాలా తేలికగా ఉంటుందని ట్రెండ్‌లు చూపిస్తున్నాయి.

రూ.50 లక్షల రుణం పూర్తి లెక్కలు:

మీరు 25 సంవత్సరాల పాటు 8.5% వడ్డీ రేటుతో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో మీ EMI దాదాపు రూ. 40,261 అవుతుంది. మొత్తం కాలంలో మీరు వడ్డీగా రూ. 70.78 లక్షలు మాత్రమే చెల్లిస్తారు. అసల+వడ్డీ కలిపి చెల్లించాల్సిన మొత్తం రూ.1.21 కోట్లు అవుతుంది. అంటే వడ్డీ అసలు మొత్తం కంటే దాదాపు రూ. 21 లక్షలు ఎక్కువ.

అదనపు EMI ఎంత పెద్ద తేడాను ఉంటుంది?

ఇప్పుడు మీరు రుణం తీసుకున్న రెండవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అదనపు EMI చెల్లించడం ప్రారంభిస్తే మీ లోన్‌ చిత్రమే మారిపోతుంది. ఈ వ్యూహంతో మీరు వడ్డీలో రూ.18.30 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, రుణ కాలపరిమితిని కూడా దాదాపు 5.5 సంవత్సరాలు తగ్గించవచ్చు. అంటే మీరు నిర్ణీత సమయం కంటే చాలా ముందుగానే రుణ విముక్తి పొందవచ్చు.

లోన్‌ పూర్తి క్యాలిక్యులేట్‌:

  • లోన్ మొత్తం: రూ. 50 లక్షలు
  • రుణం చెల్లించే కాలం: 25 సంవత్సరాలు
  • వడ్డీ రేటు: 8.5 శాతం
  • సంవత్సరానికి అదనపు EMI: రూ. 40,261
  • మొత్తం వడ్డీ మినహాయింపు: రూ.52.47 లక్షలు
  • మొత్తం పొదుపు: దాదాపు రూ. 18.30 లక్షలు

ముందస్తు చెల్లింపు ఎందుకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?

గృహ రుణం ప్రారంభ సంవత్సరాల్లో ముందస్తు చెల్లింపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో EMIలో ఎక్కువ భాగం వడ్డీకే వెళుతుంది. అందుకే కొంచెం అదనంగా చెల్లించడం వల్ల అసలు మొత్తం నేరుగా తగ్గుతుంది. మీ ఆదాయం పెరిగేకొద్దీ EMI లేదా వార్షిక ముందస్తు చెల్లింపును పెంచడం వల్ల రుణాన్ని వేగంగా పరిష్కరించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: Kitchen Tips: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర చెడిపోతుందా? ఇలా చేస్తే ఎప్పుడు తాజాగా.. అద్భుతమైన ట్రిక్‌!

ఇది కూడా చదవండి: FasTag Rule Change: వాహనదారులకు గుడ్‌న్యూస్.. కొత్త ఫాస్టాగ్‌ నియమాలు.. నేటి నుంచి అమలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి