AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలు.. ప్రస్తుతం కేజీ ఎంతంటే..?

తెలగు రాష్ట్రాల్లోని మాంసం ప్రియులకు శుభవార్త. చికెన్ ధరలు భారీగా దిగొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఏకంగా చికెన్ ధర రూ.100 మేర తగ్గింది. పండుగ సీజన్ ముగియడం, కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరగడంతో ధరలు తగ్గుతూ వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు ధర ఎంతంటే..

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలు.. ప్రస్తుతం కేజీ ఎంతంటే..?
Chciken Prices
Venkatrao Lella
|

Updated on: Feb 05, 2026 | 7:47 AM

Share

నాన్ వెజ్ ప్రియులకు గుడ్‌న్యూస్. చికెన్ ధరలు భారీగా పడిపోతున్నాయి. మొన్నటివరకు పండుగలు, జాతరలు ఉండటంతో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. కానీ సంక్రాంతి, మేడారం జాతర ముగిసిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ధరలు దిగొస్తున్నాయి. గత నెలలో సంక్రాంతి, మేడారం జాతర ఉండటంతో వివిధ ప్రాంతాలకు కోళ్ల సరఫరా పెరిగిపోయింది. డిమాండ్ ఎక్కువగా ఉండటం, కోళ్ల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో ధరల్లో పెరుగుదల నమోదైంది. కానీ ఇప్పుడు పండుగలు ఏమీ లేవకపోవడంతో డిమాండ్ తగ్గింది. ఈ కారణంతో గత కొద్దిరోజులుగా చికెన్ ధరలు తగ్గుతూ వస్తోండటంతో సామాన్యులకు భారం తగ్గుతుంది. ఇక నాన్ వెజ్ తినేవారికి ఖర్చు తగ్గడంతో ఊరట చెందుతున్నారు.

ఇప్పుడు కేజీ ఎంతంటే..?

గత నెలలో చికెన్ ధరలు పెరిగాయి. ఏకంగా కేజీ రూ.300కిపైగా చేరుకుంది. అయితే గత పది రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కోళ్ల ఉత్పత్తి పెరగడం, డిమాండ్ తగ్గడంతో చికెన్ ధరలు కుప్పకూలుతున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్ రూ.240కే లభిస్తోంది. గత నెలతో పోలిస్తే రూ.100 మేర ధర తగ్గింది. రిటైల్ మార్కెట్‌లో లైవ్ చికెన్ రూ.140గా కొనసాగుతోండగా.. డ్రెస్‌డ్ రూ.220గా ఉంది. స్కిన్‌లెస్ కేజీ చికెన్ రూ.240 నుంచి 250 మధ్య పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో అటుఇటుగా మార్పులు ఉంటాయి. ప్రస్తుతం కోళ్ల ఫారాల్లో ఉత్పత్తి పెరడంతో కోళ్ల లభ్యత కూడా ఎక్కువగా ఉంది. దీంతో చికెన్ ధరలు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నాయి. ఇక కోళ్ల ఉత్పత్తి మరింతగా తగ్గితే ధరలు ఇంకా ఎక్కువగా తగ్గే అవకాశముందని చెబుతున్నారు.

తగ్గిన కోడిగుడ్ల ధరలు

ఇక మొన్నటివరకు ఒక్కో కోడిగుడ్డు రూ.9 వరకు పలకగా.. ఇప్పుడు తగ్గుతూ వస్తోన్నాయి. రెండు నెలల పాటు అదే ధర వద్ద గుడ్ల ధరలు కొనసాగాయి. అయితే ఇప్పుడు ధరలు ఒక్కసారిగా తగ్గాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు రూ.6కే లభిస్తోంది. దీంతో సామాన్యులకు ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. ప్రతీ ఇంట్లో ఖచ్చితంగా గుడ్లు వాడుతూ ఉంటారు. సామాన్యుడికి బడ్జెట్‌లో దొరికే గుడ్లు.. కొన్నిచోట్ల రూ.10కి కూడా చేరుకున్నాయి. ఇక నాటుకోడి గుడ్లు రూ.20 వరకు పలికాయి. ఇప్పుడు చికెన్ ధరతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా ఆమాంతం తగ్గిపోతున్నాయి. దీంతో సామాన్యులకు ఇంటి ఖర్చులకు అయ్యే సొమ్ము తగ్గుతుంది. కాగా ఇటీవల సంక్రాంతి సందర్భంగా కేజీ బ్రాయిలర్ చికెన్ రూ.350 పలకగా.. మటన్ రూ.1500కి చేరుకుంది. ఇక నాటుకోడి చికెన్ అయితే ఏకంగా రూ.3 వేలకు చేరుకుని రికార్డ్ సృష్టించింది.

Follow Us
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా