Oscar Awards 2023: ఆస్కార్ అవార్డ్ దేనితో తయారు చేస్తారో తెలుసా ?.. ఆ షీల్డ్ విలువెంతంటే..

95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆ అవార్డ్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

Oscar Awards 2023: ఆస్కార్ అవార్డ్ దేనితో తయారు చేస్తారో తెలుసా ?.. ఆ షీల్డ్ విలువెంతంటే..
Oscar Award
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2023 | 10:45 AM

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్ ఆస్కార్. ప్రతి సినీ నటీనటుల కల ఈ అవార్డ్ అందుకోవడం. జీవితంలో ఒక్కసారైనా ఈ అవార్డ్ ముద్దాడాలనుకుంటారు. కనీసం ఒక్కసారైనా ఆస్కార్ కోసం పోటీపడాలని ఆశపడుతుంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ ప్రదానోత్సవ వేడుకలకు లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్ ముస్తాబయ్యింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ నటీనటులు.. దర్శక నిర్మాతలు అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈసారి మన తెలుగు చిత్రపరిశ్రమ నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయ్యింది. దీంతో యావత్ భారతీయులు ఆస్కా్ర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు ఆస్కార్ అంటే ఏంటీ ? ఆ అవార్డును దేనితో తయారు చేస్తారు ?.. ఆ షీల్డ్ విలువెంత అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఆ అవార్డ్ గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..

ఆస్కార్ అవార్డ్ హిస్టరీ..

ఆస్కార్ అవార్డ్… పసిడి వర్ణంతో.. ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిల్చొన్నట్లు కనిపిస్తోంది. దీనిని ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు. ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతడి ఆకారం నుంచి స్పూర్తిపొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా కనిపిస్తుంది. దీనిని లాస్ ఏంజిల్స్ కు చెందిన ప్రసిద్ధ శిల్ప జార్జ్ స్టాన్లీ తయారు చేశారు. చూసేందుకు గోల్డ్ షీల్డ్ గా కనిపించే ఈ ప్రతిమ.. నిజానికి బంగారం కాదు.. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పూత అద్దిన.. 13.5 అంగుళాల ఎత్తు.. 8.5 పౌండ్ల (450 గ్రాముల పైగా )బరువున్న ఆస్కార్ ప్రతిమ ఇది.

ఈ ప్రతిమ ఆధారంగా షికాగోలోని ఆర్.ఎస్. ఓవెన్స్ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏటా ఆస్కార్ ప్రతిమలను తయారు చేస్తారు. ఒక్కో ఆస్కార్ తయారీకి సుమారు 1000 డాలర్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. 50 ఆస్కార్ ప్రతిమలను రూపొందించేందుకు దాదాపు నెల సమయం పడుతుందట. అయితే ఈ అవార్డ్ విలువ ఒక డాలర్ మాత్రమే అంట. అంటే ఈ ఆస్కార్ ప్రతిమ అమ్మితే కేవలం ఒక డాలర్ మాత్రమే వస్తుందట. కానీ ఈ అవార్డ్స్ అమ్మకూడదు అనే నిబంధన ఉంది.

ఆస్కార్ పేరు..

ఈ పురస్కారాలకు ఆస్కార్ అని పేరు రావడం వెనుక ఓ ప్రచారం ఉంది. తొలిసారిగా ఈ పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్.. అందులోని యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్ లా ఉన్నాడని అందట.. ఆ తర్వాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్ స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారాలని ప్రస్తావించాడట. అలా ఆస్కార్ వాడుకలోకి వచ్చింది. మొదటిసారిగా ఆస్కార్ అందుకున్న నటుడు ఎమిల్ జన్నింగ్స్. ది లాస్డ్ కమాండ్ చిత్రానికిగానూ ఆయనకు ఉత్తమ నటుడిగా ఈ అవార్డ్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!