Oscars 2023 : నాటు నాటు సాంగ్‌తో పాటు ఆస్కార్ బరిలో ఉన్న సాంగ్స్ ఇవే..
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ను నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కించుకున్న ఈ పాట తప్పకుండా ఆస్కార్
ఆస్కార్.. ఇప్పుడు తెలుగు ప్రజలంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ ను నామినేట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కించుకున్న ఈ పాట తప్పకుండా ఆస్కార్ కూడా సొంతం చేసుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు అందరూ.. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ లాస్ ఏంజెల్స్ లో సందడి చేస్తున్నారు. ఈ నెల 13న (భారత కాలమానం ప్రకారం) ఆస్కార్ వేడుక జరగనుంది.
అయితే నాటు నాటు పాటతో పాటు మరి కొన్ని సాంగ్స్ కూడా ఆస్కార్ కోసం పోటీ పడుతున్నాయి. అవి ఏంటంటే.. ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ సినిమాలోని పాట ‘ఆప్లాజ్’, అలాగే ‘బ్లాక్ పాంథర్ : వకాండా ఫరెవ్వర్’ లోని ‘లిప్ట్ మీ అప్’ అనే సాంగ్.’ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాలోని ‘దిస్ ఇజ్ ఏ లైఫ్’
అలాగే వీఐటీతో పాటు టాప్ గన్ మావెరిక్’ సినిమాలోని ‘హోల్డ్ మై హ్యాండ్’ అనే సాంగ్ కూడా ఆస్కార్ రేస్ లో ఉంది. మరి ఈ సాంగ్స్ లో ఆస్కార్ ఏ పాటను వరిస్తుందో చూడాలి. ఇక నాటు నాటు సాంగ్ ను చంద్రబోస్ రచించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు.