Ileana D Cruz: ఇలియానను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందా ?.. సౌత్‏లో ఏ సినిమాకు సైన్ చేయని గోవా బ్యూటీ..

ఆమె తమిళంలో ఆమె సినిమా చేసి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. దీంతో ఇలియానను కోలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే ప్రచారం జరుగుతుంది.

Ileana D Cruz: ఇలియానను ఇండస్ట్రీ బ్యాన్ చేసిందా ?.. సౌత్‏లో ఏ సినిమాకు సైన్ చేయని గోవా బ్యూటీ..
Ileana
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 12, 2023 | 10:44 AM

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ ఇలియాన సుపరిచితమే. దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఒకప్పుడు వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. దక్షిణాదిలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగమ్మ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే కొన్ని రోజులు సోషల్ మీడియాలోనూ సైలెంట్ అయిన ఆమె.. ఇప్పుడిప్పుడే నెట్టింట తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే ఆమె తమిళంలో ఆమె సినిమా చేసి దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. దీంతో ఇలియానను కోలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసిందనే ప్రచారం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్లో తెగ వైరలవుతున్నాయి.

గతంలో తమిళంలో ఓ సినిమా ఒప్పుకున్న తర్వాత ఆ మూవీ ప్రొడ్యూసర్ నుంచి భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకున్నారట. అయితే అనివార్య కారణాలతో ఆ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కాకముందే ప్రాజెక్ట్ ఆగిపోయిందట. దీంతో సదరు నిర్మాతకు భారీ నష్టం వచ్చిందట. తనకు న్యాయం చేయాలంటూ ఆయన తమిళ చలనచిత్ర నిర్మాతల మండలిని ఆశ్రయించారట. ఆయన ఫిర్యాదును పరిశీలించిన నిర్మాతల మండలి.. ఇలియానను తిరిగి డబ్బులు చెల్లించాలని కోరగా.. అందుకు ఆమె అంగీకరించలేదట. ఆ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వను అని చెప్పిందట. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీ ఆమెను బ్యాన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే తన గురించి వస్తున్న ఈ వార్తలపై ఇప్పటివరకు ఇలియానా స్పందించలేదు. ఇలియాన చివరిసారిగా ది బిగగ్ బుల్ చిత్రంలో కనిపించింది. ఇటీవల తాను అనారోగ్యానికి గురైనట్లుగా సోషల్ మీడియాలో అభిమానులకు తెలిపింది ఇలియాన. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటోస్ నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్స్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!