Kovai Sarala : ఇంతవరకు పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన లేడీ కమెడియన్ కోవై సరళ..
సినీరంగంలో హాస్యనటీనటులుగా చక్రం తిప్పిన వారిలో కోవై సరళ ఒకరు. చాలా మందికి ఆమమె పేరు వినగానే చిన్నపాటి చిరునవ్వు వచ్చేస్తుంది. బ్రహ్మనందతో కలిసి ఆమె పండించిన కామెడీ చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలోనూ అనేక హిట్ చిత్రాల్లో నటించి ఉత్తమ హాస్యనటిగా ఏకంగా రెండు నంది అవార్డ్స్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

టాలీవుడ్ సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు కోవై సరళ. ఒకప్పుడు తెలుగు సినిమా ప్రపంచంలో హాస్య నటిగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో బ్రహ్మానందం, తమిళంలో వడివేలుకు జంటగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి బోలెడన్నీ పురస్కారాలు అందుకున్న ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటుంది. తెరపై నవ్వులు పంచిన ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఆరో తరగతిలో ఉండగానే కోవై సరళ తన అభిమాన నటుడు ఎంజీఆర్ ను చూసేందుకు కోయంబత్తూరులోని హోటల్ బయట నిల్చుంది. స్కూల్ డ్రెస్ లో రెండు జళ్లు వేసుకుని ఉన్న ఆమె ఎంజీఆర్ ను చూడలేకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఇక విషయం తెలుసుకున్న ఎంజీఆర్ ఆమెను ఇంటికి పిలిచి మరీ ఆరా తీశారు. ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకు ఆమమె చదువుతున్న సూక్ల్ కు ఫీజు పంపించాడు.
ఇక తన అభిమాన నటుడు ఏంజీఆర్ లాగే తాను కూడా వెండితెరపై అలరించాలనుకుంది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే వెళ్లి రత్తం అనే చిత్రంతో 1979లో సినీరంగ ప్రవేశం చేసింది. పదో తరగతిలోనే గర్భిణి పాత్రలో నటించింది. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన ముద్ర వేసింది. ఎన్నో వందల సినిమాలు చేసిన కోవై సరళ.. తెలుగులో పాపులర్ లేడీ కమెడియన్ గా తనదైన ముద్ర వేసింది. అయితే కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాలు వెల్లడించింది. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద. తన నలుగురు చెల్లెళ్లను దగ్గరుండి చదివించి పెళ్లి చేసింది. అలాగే వారికి పుట్టిన పిల్లల బాధ్యత సైతం తనే తీసుకుంది. కుటుంబం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. పెళ్లి చేసుకోలేదనే విషయం గురించి ఎప్పుడైనా పశ్చాత్తాపపడ్డారా అని అడిగిన ప్రశ్నకు, ఆమె తానిప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం గురించి ఎటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదని అన్నారు. పైగా, పెళ్లయిన వారిని చూసి నవ్వు వస్తుందని, వారు పడే కష్టాల పట్ల తనను తాను బాధపడతానని ఆమె పేర్కొన్నారు. ప్రతి మనిషి జీవితంలో ఒంటరిగానే జీవించాల్సి వస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. చిన్నతనం నుంచే తనలో ఆధ్యాత్మికత ఉందని, తెలియకుండానే ఆ మార్గంలో సాగానని సరళ అన్నారు. తన కెరీర్ లక్ష్యాలపై ఆమెకు స్పష్టమైన దృష్టి ఉండేదని, ఐదేళ్ల వయస్సు నుంచే తన ముఖం ప్రజలకు తెలియాలని, పది మంది తనను గుర్తించాలని కోరుకున్నానని ఆమె తెలిపారు. గుఱ్ఱానికి కళ్లెం వేసినట్లుగా, ఆమె దృష్టి ఎప్పుడూ తన లక్ష్యాల వైపు మాత్రమే ఉండేది. అందువల్లే, వివాహ బంధం గురించి ఆమె ఎప్పుడూ ఆలోచించలేదని స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
