Mokshagna : నందమూరి ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ సినిమాలో బాలయ్య.. డైరెక్టర్ ప్లానింగ్ అదుర్స్..
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో మోక్షజ్ఞ నటించనున్నారు. అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆత్రుతగా వెయిట్ చేస్తున్న అభిమానులకు రోజుకో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో పవర్ ఫుల్ న్యూస్ వైరల్ గా మారింది.

నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రం కోసం ప్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ అభిమాన హీరో తనయుడి సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్న నందమూరి అభిమానులకో రోజుకో క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే సోషియో ఫాంటసీ చిత్రాల జానర్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వశిష్ట.. ఇప్పుడు మోక్షజ్ఞతో ఓ సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే ఇందులో శ్రీలీలను కథానాయికగా తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Pragathi : ఆ వాన సాంగ్ వల్ల హీరోయిన్గా సినిమాలు చేయడం మానేశా.. నటి ప్రగతి కామెంట్స్..
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో దాదాపు 40 శాతానికి పైగా భాగం అత్యున్నత స్థాయి వీఎఫ్ఎక్స్ హంగులతో రూపుదిద్ధుకుంటుందట. బింబిసార, విశ్వంభర చిత్లాలను మించేలా విజువల్ ఎఫెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే అయితే ఈ సినిమాలో బాలయ్య సైతం కీలకపాత్రలో కనిపించనున్నారట. ముఖ్యంగా కథను మలుపు తిప్పే పాత్రలో బాలయ్య కనిపించనున్నారని టాక్. దీంతో మొదటి చిత్రంలోనే బాలయ్య, మోక్షజ్ఞ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించే ఆ సన్నివేశాలు థియేటర్లలో నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : తొలి సూపర్ స్టార్ కమెడియన్.. ఖరీదైన కారులో ప్రయాణించి.. 44 ఏళ్ళ వయసులోనే రైల్వే స్టేషన్ రోడ్డు మీద అనాథలా..
ఈ సినిమాతోనే మోక్షజ్ఞను పాన్ ఇండియా స్థాయిలో బలంగా లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నారట బాలకృష్ణ. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎంట్రీ ఉందని తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : K. Raghavendra Rao : నా జీవితంలో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సాంగ్ అది.. తెలుగు చరిత్రలో ఒక గొప్ప మైలురాయి.. రాఘవేంద్రరావు..
ఎక్కువ మంది చదివినవి : Cinema : వామ్మో.. ఇదేక్కడి క్రేజ్ భయ్యా.. 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సిరీస్..
సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
