Janhvi Kapoor : అది నా పొరపాటే.. నేను ఇంకాస్త గట్టిగా వాదించాల్సింది.. పెద్ది వివాదం పై స్పందించిన జాన్వీ కపూర్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న జాన్వీ కపూర్.. తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపు కోసం ట్రై చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ సరసన దేవర, రామ్ చరణ్ జోడిగా పెద్ది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పెద్ది చిత్రం వివాదం పై స్పందించింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కానీ ఇందులో అచ్చియమ్మ పాత్రలో నటించిన జాన్వీ కపూర్ ను చూపించిన విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మహిళలను కించపర్చేలా ఆమె పాత్రను చూపించారని.. అవసరానికి మించిన గ్లామర్, అలాగే అసభ్యకరంగా చూపించారంటూ సోషల్ మీడియాలో మండిపడ్డారు నెటిజన్స్. అలాగే పలువురు సెలబ్రిటీలు సైతం ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. అయితే తాజాగా పెద్ది వివాదం పై జాన్వీ కపూర్ స్పందించారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై తన ఆలోచనలను, అలాగే ఆ సమయంలో తాను మౌనంగా ఉండటానికి కారణాలను వెల్లడించింది. పెద్ది విషయంలో ఏం జరిగింది. అది నిన్ను చాలా విధాలుగా ప్రభావితం చేసిందని నాకు తెలుసు. ఎందుకంటే ఆరోజు నేను నీతో మాట్లాడాను. ఆ సీన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించే వర్గం ఉంది. దీనిపై నీ సమాధానం ఏంటీ అని ప్రశ్నించారు కరణ్ జోహర్.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
దీనిపై జాన్వీ కపూర్ స్పందిస్తూ.. సినిమా కోసం ఎంతో మంది కష్టపడ్డారని నాకు తెలుసు. అందుకే ఆ విషయం గురించి మాట్లాడటానికి ఆలోచించాను. పెద్దిలో నా పాత్రను చూపించి తీరు సమాజంపై.. ముఖ్యంగా మహిళల పట్ల ఉండే దృక్పథంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందని అన్నారు జాన్వీ. అయితే ఈ విషయంలో నేను కూడా బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికీ ఆ విషయంపై నాకు బాధగా ఉంది. ఆ భారాన్ని నేను ఎప్పటికీ మోస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చారు. ఇకపై తాను ఈ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించాలనుకోవడం లేదని.. అలా మాట్లాడితే ఇతరులను నిందించినట్లు అవుతుందని అన్నారు. ఆ సమయంలో నేను నా అభ్యంతరాలను గట్టిగా వినిపించి ఉండాల్సింది అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మళ్లీ ఎదురుకాకుండా చూసుకోవడమే ఇప్పుడు తన ముందున్న లక్ష్యమని అన్నారు. సాధారణంగా దర్శకుడు చెప్పిన విధంగా పనిచేయాలనే ఒత్తిడి నటీనటులపై ఉంటుందని.. ప్రొఫెషనల్ గా ఉండాలనే ఉద్దేశంతో దర్శకుడు చెప్పింది చేశానని అన్నారు. అలా అని తప్పును ఇతరులపై నెట్టడం తనకు నచ్చదని అన్నారు. ఈ వివాదం తనకు ఎప్పటికీ బాధాకరమైన అనుభవంగానే మిగిలిపోతుందని అన్నారు. ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
