AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranbir Kapoor : రణబీర్, అలియా ఇంట్లో రోజూ ఉదయం మొదలయ్యేది అలాగే.. కూతురు పుట్టినప్పటి నుంచి పాటిస్తున్న ప్రత్యేక ఆచారం..

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటేస్ట్ మూవీ రామాయణం. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు ఎట్టకేలకు అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ సినిమా మొదటి భాగం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో , అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' దీపావళి ప్రత్యేక ఎపిసోడ్లలో రణబీర్ కపూర్, సాయి పల్లవి పాల్గొననున్నారు.

Ranbir Kapoor : రణబీర్, అలియా ఇంట్లో రోజూ ఉదయం మొదలయ్యేది అలాగే.. కూతురు పుట్టినప్పటి నుంచి పాటిస్తున్న ప్రత్యేక ఆచారం..
Ranbir Family
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2026 | 11:04 AM

Share

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాతో తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్. ప్రస్తుతం డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రాముడిగా రణబీర్, సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది చిత్రూనిట్. ఈ క్రమంలోనే తాజాగా రణబీర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భార్య ఆలియా భట్‌తో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న రణ్‌బీర్, తమ గారాలపట్టి రాహా పుట్టినప్పటి నుంచి తమ కుటుంబంలో ఒక అందమైన ఆధ్యాత్మిక అలవాటును పాటిస్తున్నట్లు తాజాగా వెల్లడించారు. ప్రముఖ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసే ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

షోలో భాగంగా రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ.. తమ కూతురు రాహా జన్మించిన క్షణం నుంచి ఇప్పటివరకు ప్రతిరోజూ ఉదయం పూట తమ దినచర్య ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పాటతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. అమితాబ్ బచ్చన్ స్వయంగా ఆలపించిన ‘హనుమాన్ చాలీసా’తోనే తమ ప్రతి ఉదయం మొదలవుతుందని ఆయన చెప్పారు. “నా కూతురు రాహా పుట్టినప్పటి నుండి, ఉదయం లేవగానే మీరు (అమితాబ్ బచ్చన్) పాడిన హనుమాన్ చాలీసా వినకుండా ఏ ఒక్క రోజు కూడా గడవలేదు” అని రణ్‌బీర్ ఎంతో గౌరవంగా తెలిపారు. ఈ మాటలు విన్న అమితాబ్ బచ్చన్ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఆశ్చర్యపోయారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

ఇదే షోలో తన భార్య ఆలియా భట్‌తో ఉన్న బంధం, పెళ్లికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను కూడా రణ్‌బీర్ పంచుకున్నారు. ఒకరిపై ఒకరికి ఉండే స్నేహభావం, నమ్మకం, గౌరవమే తమ అందమైన కాపురానికి అసలు పునాది అని రణబీర్ అన్నారు. 2022లో వివాహం చేసుకున్న ఈ జంట, అదే ఏడాది నవంబర్‌లో కూతురు రాహాకు స్వాగతం పలికారు. ప్రస్తుతం రణ్‌బీర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Follow Us