AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10వేలు సంపాదించినా ఇలా సేవ్ చేస్తే ఎవరైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే.. శోభన్ బాబు చెప్పిన ఈ ఐడియాస్ పాటిస్తే..

సీనియర్ నటుడు మురళీ మోహన్ దివంగత నటుడు శోభన్ బాబు ఆర్థిక సూత్రాలను చాలా సందర్భాల్లో పంచుకున్నారు. భూముల్లో పెట్టుబడులు, పొదుపు, , అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండటం వంటి శోభన్ బాబు ఆర్థిక ఐడియాలజీని తాను ఎలా పాటించి కోటీశ్వరుడిగా మారారో మురళీ మోహన్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు. సినిమా నిర్మాణంలోని సవాళ్లను కూడా ఆయన తెలియజేశారు.

రూ.10వేలు సంపాదించినా ఇలా సేవ్ చేస్తే ఎవరైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే.. శోభన్ బాబు చెప్పిన ఈ ఐడియాస్ పాటిస్తే..
Sobhan Babu
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2026 | 1:19 PM

Share

తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాగంటి మురళీ మోహన్. తన ఆర్థిక విజయం వెనుక దివంగత నటుడు శోభన్ బాబు స్ఫూర్తి ఉందని వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన శోభన్ బాబు పెట్టుబడి వ్యూహాలను, తన జీవితంలో వాటి ప్రభావాలను వివరించారు. మురళీ మోహన్ తన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ, తాను ఒక సినిమాకు వెయ్యి రూపాయలు తీసుకుంటున్న సమయంలోనే చెన్నైలోని టి.నగర్‌లో 50,000 రూపాయలకు 11,000 చదరపు అడుగుల ఇంటిని కొనుగోలు చేశానని చెప్పారు. ఆ ఇల్లు ప్రస్తుతం 50 కోట్ల రూపాయలకు పైగా విలువ చేస్తుందని తెలిపారు. అప్పటి నుంచే తాను “డబ్బును డబ్బు సంపాదించే విధంగా చేయాలి తప్ప, ఖర్చు పెట్టకూడదు” అనే సూత్రాన్ని నమ్మానని, ఇదే ఐడియాలజీ శోభన్ బాబుదని పేర్కొన్నారు.

శోభన్ బాబు ఎప్పుడూ లగ్జరీలకు పోకుండా, అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టేవారని మురళీ మోహన్ వివరించారు. ఆయన సాధారణంగా తెల్ల బట్టలనే ధరించేవారని, డబ్బును భూముల మీద పెట్టుబడిగా పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైకి దగ్గరలో ఎకరం 500 రూపాయలకు కొని వదిలేసేవారని, 20 సంవత్సరాల తర్వాత ఆ భూమి విలువ ఎకరాకు 5 కోట్ల రూపాయలకు పెరిగిందని చెప్పారు. ఈ విధంగా శోభన్ బాబు వందల ఎకరాలను కొనుగోలు చేసి, వాటిని వందల కోట్లకు విక్రయించి భారీ సంపదను కూడబెట్టారని తెలిపారు. ఇంత సంపాదించినా, ఆయన ఎప్పుడూ ఒక చిన్న అంబాసిడర్ కారులోనే ప్రయాణించేవారని, ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనమని మురళీ మోహన్ ప్రశంసించారు.

పెట్టుబడుల ద్వారా వచ్చిన డబ్బును శోభన్ బాబు తిరిగి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టేవారని, వాటి వడ్డీతో తన ఖర్చులను చూసుకునేవారని మురళీ మోహన్ పేర్కొన్నారు. తన కుమార్తె వివాహానికి 50 కోట్లు, కుమారుడి వివాహానికి 50 కోట్లు ఖర్చు పెట్టినా, మిగిలిన డబ్బు మొత్తాన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్‌లోనే పెట్టుబడిగా పెట్టేవారని వివరించారు. ఆరోజుల్లో చాలామంది నటులు, నిర్మాతలు గుర్రపు పందాలు, క్యాసినోలు, బెట్టింగ్‌ల వంటి వాటిలో డబ్బులు పోగొట్టుకునేవారు కానీ, శోభన్ బాబు మాత్రం భూముల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడించేవారని మురళీ మోహన్ స్పష్టం చేశారు. తాను కూడా శోభన్ బాబు అడుగుజాడల్లో నడిచి, ఆయన చెప్పిన పెట్టుబడి సూత్రాలను పాటించడం వల్లనే ఈ రోజున ఇంత ఆస్తిపరుడిని అయ్యానని గర్వంగా చెప్పారు. “నీకు అవసరమైనంత వరకే ఖర్చు పెట్టుకో” అన్న శోభన్ బాబు గారి సలహాను తాను తు.చ. తప్పకుండా పాటించానని, అదే తన ఆర్థిక విజయానికి కారణమని మురళీ మోహన్ చెప్పారు. అందరూ తమ డబ్బును పొదుపు చేసి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి సంతోషంగా జీవించాలని ఆయన సందేశం ఇచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

Follow Us
డబ్బు ఇలా సేవ్ చేస్తే తిరుగుండదు.. శోభన్ బాబు చెప్పిన మనీ సీక్రెట
డబ్బు ఇలా సేవ్ చేస్తే తిరుగుండదు.. శోభన్ బాబు చెప్పిన మనీ సీక్రెట
30 రోజుల పాటు.. పరగడుపున కరివేపాకు జ్యూస్‌ అలవాటు చేసుకోండి..
30 రోజుల పాటు.. పరగడుపున కరివేపాకు జ్యూస్‌ అలవాటు చేసుకోండి..
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!
దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే తోపు!
దమ్ముంటే కాస్కో.. ఈ చిత్రంలో ఉన్న జంతువును గుర్తిస్తే మీరే తోపు!
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.
ఉద్యోగంలో సమస్యలు, ప్రమోషన్‌లో అడ్డంకులా? కెరీర్ పురోగతికి.
ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..
ఆ భారాన్ని ఎప్పటికీ మోస్తూనే ఉంటా.. పెద్ది వివాదం పై జాన్వీ..
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ వివరణ
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
అర్నబ్ తుఫాన్ నుంచి కోలుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..