AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jason Sanjay: రూ.640 కోట్ల ఆస్తికి వారసుడు.. అయినా అంత సింపుల్ కారు ఇష్టమా ?.. విజయ్ కొడుకుకు ఇష్టమైన కారు అదే..

సీఎం విజయ్ దళపతి తనయుడు జాసన్ సంజయ్ ప్రస్తుతం సినీరంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ సిగ్మా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ సంజయ్ తనకు ఇష్టమైన కారు గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ కారు గురించి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.

Jason Sanjay: రూ.640 కోట్ల ఆస్తికి వారసుడు.. అయినా అంత సింపుల్ కారు ఇష్టమా ?.. విజయ్ కొడుకుకు ఇష్టమైన కారు అదే..
Jason Sanjay
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2026 | 12:16 PM

Share

తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు సీక్వరించి ప్రజాపాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఆయన కుమారుడు జాసన్ సంజయ్ సిగ్మా సినిమా దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదెలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాసన్ సంజయ్ తనకు ఇష్టమైన కారు గురించి చెప్పుకోచ్చారు. దీంతో ఇప్పుడు జాసన్ పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. జాసన్ మాట్లాడుతూ.. “నాకు ఇష్టమైనది హ్యుండాయ్ ఐ20, అది నడపడానికి సరదాగా ఉండే కారు. ఒకే ఒక్క సమస్య ఏమిటంటే, దాని మైలేజ్ కొంచెం తక్కువగా ఉంటుంది,” అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

ప్రపంచంలోని ఏ విలాసవంతమైన వాహనాన్నైనా సులభంగా కొనగలిగే ఒక స్టార్ కుటుంబంలో పుట్టినప్పటికీ, సామాన్యులు ఎంతగానో ఇష్టపడే ఒక హ్యాచ్‌బ్యాక్ కారును ఇష్టపడటం, దాని మైలేజ్ గురించి మాట్లాడటంలో జాసన్ సరళ మనస్తత్వం ప్రతిబింబిస్తుందని అభిమానులు అంటున్నారు. “మీరు అంత ధనవంతుడైన తండ్రి కొడుకై కూడా మైలేజీ గురించి పట్టించుకుంటున్నారంటే, అది మీ సరళమైన మనస్తత్వం వల్లే. ఇదే ఒక మంచి తండ్రి లక్షణం,” అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. గ్యారేజీలో ఖరీదైన సూపర్‌కార్లు ఉన్నప్పటికీ జీవితంలో సాధారణంగా ఉండే జాసన్ ప్రవర్తనను నెటిజన్లు ఏకగ్రీవంగా ప్రశంసిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

జాసన్ తన తొలి దర్శకత్వ ప్రయత్నమైన ‘సిగ్మా’ చిత్రంతో ప్రశంసలు అందుకున్నాడు. ఇది ఒక యాక్షన్-అడ్వెంచర్, హెయిస్ట్ కామెడీ చిత్రం. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అన్బు దాసన్, యోగ్ జప్పి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

జాసన్ సంజయ్..

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

Follow Us
విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..
విజయ్ తనయుడికి ఇష్టమైన ఈ కారు గురించి ఆరా తీస్తున్న నెటిజన్స్..
2 స్పూన్లు నిమ్మ చెట్టుకు ఇచ్చి చూడండి.. ఇక కాయలే కాయలు
2 స్పూన్లు నిమ్మ చెట్టుకు ఇచ్చి చూడండి.. ఇక కాయలే కాయలు
ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని..
ధనత్రయోదశి ప్రత్యేకం: ఎవరీ ధన్వంతరి? ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని..
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఇలాంటి లైఫ్ మీరు కూడా దాటి వచ్చారా..?
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
ఈ నెలా 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
విషాదం.. నీట్‌లో ర్యాంకు రాలేదని మనస్తాపంతో విద్యార్థి మృతి!
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
కేపీహెచ్‌బీలో ఫ్యామిలీ సూసైడ్.. వీడియో కాల్‌లో అంత్యక్రియలు
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
ఇటుకపై నిలబడి భక్తుని కోసం ఎదురుచూసిన పాండురంగడు.. పండరీపురం..
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
పామాయిల్‌తో వండిన ఆహారం తింటే ఏమౌతుంది..? గుండె ఆరోగ్యం గురించి
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..
నడి సంద్రంలో వైజాగ్ కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్..