AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నం!.. కట్‌చేస్తే..

అతనో ప్రభుత్వ ఉద్యోగి.. మంచి జీతం, స్థిరమైన జీవితం. తనతో పాటు తన కూతురిని కూడా బాగా చూసుకుంటున్నాడు. భార్యకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఒకసారి తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశం కల్పించాడు. కానీ, అతని మంచితనమే చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. భర్త ఇచ్చిన స్వేచ్ఛను అవకాశంగా తీసుకున్న భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చివరకు అతనితో కలిసి భర్తనే హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య యత్నం!.. కట్‌చేస్తే..
Ghaziabad Man Confronts Wife Over Affair With Gym Trainer
Anand T
|

Updated on: Oct 29, 2026 | 1:47 PM

Share

ప్రియుడితో కలిసి ఓ భార్య తన భర్తనే హత్య చేసేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. ప్రియుడి దాడితో తీవ్రంగా గాయపడిన భర్తను గమనించిన స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించగా, ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీ ప్రభుత్వంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల శశాంక్ కంథారియా అనే వ్యక్తికి, ప్రియ అనే యువతితో 2021లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఒక కుమార్తె కూడా ఉంది. ఈ జంట ఢిల్లీలోని వసుంధర అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటోంది.

ఇందిరాపురం ఏసీపీ సూర్యబలి మౌర్య చెప్పిన వివరాల ప్రకారం.. శశాంక్ భార్య ప్రియకు జిమ్‌కు వెళ్లే అలవాటు ఉంది. దీంతో ఆమె స్థానికంగా ఉన్న ఓ జిమ్‌కు రోజూ వెళ్తూ ఉండేది. గత జనవరిలో అదే జిమ్‌లో ట్రైనర్‌గా చేరిన సింగ్ అనే వ్యక్తితో ప్రియకు పరిచయం ఏర్పడింది. ఒక నెల వ్యవధిలోనే వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. అప్పటి నుంచి గుట్టుగా ఈ వ్యవహారాన్ని వాళ్లు కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే గత నెల సెప్టెంబర్‌లో శశాంక్‌కు భార్య ఎఫైర్ గురించి తెలిసింది. దీంతో ఈ సంబంధంపై అతను ప్రియను నిలదీశాడు.. జిమ్‌ అయినా మారు.. లేదా ఆ జిమ్‌కు వెళ్లడం మానేయాలని చెప్పాడు.

అయినా ఆమె తీరులో మార్పు రాకపోవడంతో తన ఫ్లాట్‌ను మార్చాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. భర్త కొత్త ఇల్లు వెతకడాన్ని ప్రియ వ్యతిరేకించిందని.. ఈ విషయాన్ని సింగ్‌తో కూడా చెప్పిందని పోలీసులు తెలిపారు. ఇలాగైతే ఇద్దరూ కలిసి ఉండటం కుదరదని.. శశాంక్‌ను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. ఇక పథకం ప్రకారం రోజూలాగే ప్రియ జిమ్‌కు వెళ్లింది. అయితే సింగ్ ఇంట్లోకి ప్రవేశించేందుకు వీలుగా ఇంటి మెయిన్ డోర్‌ను ఓపెన్ చేసి వెళ్లింది.

ఇక ప్రియ ఇంట్లో నుంచి వెళ్లగానే కత్తులతో సింగ్ ఇంట్లోకి ప్రవేశించి.. బెడ్‌రూమ్‌లో కూతురి పక్కన నిద్రపోతున్న శశాంక్‌పై కత్తులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. శశాంక్ అరుపులు విని కూతురు నిద్రలేచి ఏడవడంతో సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. అయితే చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై తీవ్రంగా గాయపడిన శశాంక్‌ను హాస్పిటల్‌కు తరలించారు.

చేతులకు రక్తంతో బయటకు వచ్చిన సింగ్‌ను చూసిన సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లను నెట్టేసి సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది బైక్‌పై అతన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వీరి వివాహేతర సంబంధం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ప్రియుడితో పాటు ప్రియను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
ఆరోగ్యానికి ఆయువుపట్టు ఈ జావ.. ఒక్క గ్లాస్ తాగండి
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
జిమ్‌ ట్రైనర్‌తో ప్రేమ వ్యవహారం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు
రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!
రోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!
ప్రపంచ ప్రసిద్ధ భారతీయ పర్యాటక ప్రాంతాలు.. మన దేశంలో అద్భుతాలు..
ప్రపంచ ప్రసిద్ధ భారతీయ పర్యాటక ప్రాంతాలు.. మన దేశంలో అద్భుతాలు..
బొప్పాయి సాగుతో అద్భుత లాభాలు..
బొప్పాయి సాగుతో అద్భుత లాభాలు..
డబ్బు ఇలా సేవ్ చేస్తే తిరుగుండదు.. శోభన్ బాబు చెప్పిన మనీ సీక్రెట
డబ్బు ఇలా సేవ్ చేస్తే తిరుగుండదు.. శోభన్ బాబు చెప్పిన మనీ సీక్రెట
30 రోజుల పాటు.. పరగడుపున కరివేపాకు జ్యూస్‌ అలవాటు చేసుకోండి..
30 రోజుల పాటు.. పరగడుపున కరివేపాకు జ్యూస్‌ అలవాటు చేసుకోండి..
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..
శని సాడే సతి ముగిశాక అదృష్టం మారుతుందా? జీవితంలో వచ్చే 5 కీలక..
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
ధన త్రయోదశి రోజు బంగారం కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!
అవమానాలను అధిగమించి వైద్యురాలిగా.. రూత్ జాన్ పాల్ విజయగాథ!