బంపర్ ఆఫర్ కొట్టేసిన రుక్మిణి.. ఆ హీరో సినిమాలో ఛాన్స్ 

28 October 2026

Rajeev 

యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

భారీ యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న త్రాగెను డ్రాగన్ 2027 జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  

ఒకే ఒక జీవితం ఫేమ్ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమాలో రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అక్టోబర్ 23న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

ఈ కొత్త సినిమాలో ఆమె తార అనే పాత్రలో నటించనున్నారు. దేవ్ రామ్‌నాథ్, వినాయక్ వైద్యనాథన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

కాంతార: చాప్టర్ 1తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణికి ఇప్పుడు భారీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఆ క్రేజ్‌ను తెలుగు సినిమాల్లోనూ రాణించాలని చూస్తుంది.

కన్నడ స్టార్ యశ్ నటించిన టాక్సిక్ చిత్రంలోనూ రుక్మిణి భాగమయ్యారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ తదితర నటీమణులు కూడా నటించారు

నాని, దర్శకుడు ప్రేమ్ కుమార్ కాంబినేషన్‌లో రాబోయే ప్రేమకథలో రుక్మిణి పేరు వినిపిస్తోంది. అయితే ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడలేదు.